/rtv/media/media_files/2026/02/28/ac-offers-2026-02-28-19-57-20.jpg)
AC OFFERS
వేసవి కాలం వచ్చేసింది. చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తిచూపిస్తుంటారు. అయితే వాటి ధర అధికంగా అంటే సుమారు రూ.30వేల నుంచి 40వేలకు పైగా ఉండటంతో చిన్న చిన్న కూలర్లు కొనుక్కుని సరిపెట్టుకుంటారు. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరకే సరికొత్త ఏసీని సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో MarQ by Flipkart ఏసీపై అదిరిపోయే ఆఫర్ ఉంది. ఆ ఆఫర్‌తో ఏసీని కేవలం రూ.20వేల లోపే కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
MarQ by Flipkart AC price
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న MarQ by Flipkart ఏసీ అసలు ధర రూ.45,099గా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. దాదాపు 56శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.19,990లకే ఈ ఏసీని కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. ఇది 2025 Model 1 Ton 3 Star Split Inverter 5-in-1 Convertible with Turbo Cool Technology AC (103IPG25WQV2, White)కి వర్తిస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి.
MarQ by Flipkart AC Specs
ఇది 3 స్టార్ బీఈఈ (BEE) రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా కంప్రెసర్ వేగాన్ని మార్చుకుంటూ కరెంట్ బిల్లును గణనీయంగా తగ్గిస్తుంది. గది త్వరగా చల్లబడాలంటే 'టర్బో మోడ్' ఉపయోగపడుతుంది. అలాగే, నిద్రపోయేటప్పుడు సౌకర్యవంతంగా ఉండటానికి 'స్లీప్ మోడ్', నిశ్శబ్దంగా పనిచేసే 'క్వియట్ మోడ్' ఉన్నాయి. ఇందులోని డస్ట్ ఫిల్టర్ గాలిలోని దుమ్మును తొలగించి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. LED డిస్ప్లే, 4-వే ఎయిర్ స్వింగ్ వల్ల గది అంతటా చల్లటి గాలి సమానంగా అందుతుంది.
Follow Us