Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. రూ.7,500లకే కొత్త ఫోన్ లాంచ్

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా నుంచి కొత్త 'lava shark 2' ఫోన్ లాంచ్ అయింది. దీని ధర సుమారు రూ.7,500గా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిపై రూ.750 తగ్గింపు ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.6,750 కి తగ్గుతుంది.

New Update
lava shark 2 price in india

lava shark 2 price in india

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కంపెనీ తమ మోడళ్లను అతి తక్కువ ధరలో లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కంపెనీ భారతదేశంలో మరో సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా కొత్త Lava Shark 2 ను లాంచ్ చేసింది. ఇది రిటైల్ దుకాణాల్లో అందుబాటులోకి వచ్చింది. Lava Shark 2 ఫోన్ 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. LCD ప్యానెల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్ తో ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. ఇప్పుడు ఫోన్ ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

lava shark 2 price in india

Lava Shark 2 Price

Lava Shark 2 ను కంపెనీ భారతదేశంలో రూ.7,500 కు లాంచ్ చేసింది. ఈ ధరలో కంపెనీ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్‌పై తక్షణ తగ్గింపు కూడా ఉంది. ఫోన్ కొనుగోలుపై రూ.750 తగ్గింపును అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.6,750 కి చేరుకుంది. కాగా దీనిని రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. 

Lava Shark 2 specs

Lava Shark 2 మొబైల్ 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. LCD ప్యానెల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Lava Shark 2 ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్ తో వస్తుంది. RAMని 4GB వరకు విస్తరించవచ్చు. Android 15లో Lava Shark 2 నడుస్తుంది. 

కెమెరా విషయానికొస్తే.. Lava Shark 2 మొబైల్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Lava Shark 2 ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. 

Advertisment
తాజా కథనాలు