Japan Miracle: జపాన్ అద్భుత సృష్టి.. సెకన్‌కు 150 జీబీ డేటా డౌన్‌లోడ్.. 1.02 పెటాబిట్స్ స్పీడ్!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సెకనుకు 1.02 పెటాబిట్స్‌ను జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ ఇంటర్నెట్ స్పీడ్‌తో సంగీతం, సినిమాలు, గేమ్‌లు ఇలా మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోని లైబ్రరీలను కేవలం కొన్ని క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

New Update
Japan New Technology

Japan New Technology (Twitter Image)

జపాన్ పేరు వింటే చాలు.. అత్యాధునిక ఆవిష్కరణలు అన్ని గుర్తు వస్తాయి. ప్రపంచమంతా ఒక సంవత్సరంలో ఉంటే జపాన్ అయితే కొన్నేళ్లు ముందు ఉంటుంది. ఈ దేశంలో అన్ని కూడా అప్‌డేట్ వెర్షన్లు ఉంటాయి. అయితే జపాన్ దేశం మరో సరికొత్త ఆవిష్కరణను తీసుకొస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను జపాన్ గుర్తించింది.

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చూడండి: Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!

రెప్ప పాటు సెకన్లలో..

అత్యంత వేగం సెకనుకు 1.02 పెటాబిట్స్‌ వరకు జపాన్ పరిశోధకులు చేరుకున్నారు. ఈ ఇంటర్నెట్ స్పీడ్‌తో సంగీతం, సినిమాలు, గేమ్‌లు ఇలా మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోని లైబ్రరీలను కేవలం కొన్ని క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కళ్లు మూసి తెరిచే లోగా అన్ని కూడా డౌన్‌లోడ్ అయిపోతాయి. 150 జీబీ డేటాను కేవలం సెకన్లలోనే డౌన్‌లోడ్ చేస్తుంది. దీన్ని జపాన్ ఎన్‌ఐసీటీలోని ఫొటోనిక్ నెట్‌వర్క్ లాబోరేటరీ టీమ్, సుమితోమో ఎలక్ట్రిక్ అండ్ యూరోపియన్ పార్ట్‌నర్స్‌తో కలిపి అభివృద్ధి చేసింది. 

ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

జపాన్ కొత్తగా ఆవిష్కరించిన ఈ నెట్ స్పీడ్ అమెరికాలో ఉన్న సగటు ఇంటర్నెట్ కనెక్షన్ల కంటే 3.5 మిలియన్ల రేట్లు కంటే ఎక్కువని జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తెలిపింది. అదే భారత్‌లో ఉండే నెట్‌వర్క్ స్పీడ్‌తో పోలిస్తే 16 మిలియ్ రెట్లు ఎక్కువ. అయితే ఒక వికీపిడియా స్టోరేజీ దాదాపుగా 100 జీబీ ఉంటుంది. అదే కొత్త ఇంటర్నెట్ సాయంతో అయితే కేవలం ఒక సెకనులో 8 కే వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జపాన్ పరిశోధకులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు