/rtv/media/media_files/2025/10/31/iqoo-neo-11-2025-10-31-21-10-47.jpg)
iQOO Neo 11
iQOO తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11 ను చైనాలో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ అధిక-పనితీరు గల గేమింగ్, పవర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్‌లోకి వచ్చింది. ఇది క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, 144Hz LTPO AMOLED డిస్ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆకర్షణీయమైన హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది. iQOO Neo 11 ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మెరుగైన గేమింగ్ కోసం ఇది 25.4ms టచ్ రెస్పాన్స్ సమయంతో వస్తుంది. iQOO దాని స్వంత మాన్స్టర్ సూపర్-కోర్ ఇంజిన్, Q2 చిప్‌ను అందించింది. ఇది గేమింగ్ పరంగా ఫోన్ పనితీరును మరింత సున్నితంగా చేస్తుందని కంపెనీ పేర్కొంది.
iQOO Neo 11 Price
iQOO Neo 11 చైనాలో అనేక వేరియంట్లలో లాంచ్ అయింది.
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 32,500.
12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 38,500.
16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 36,000.
16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 41,000.
16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 47,000.
iQOO Neo 11 గ్వాంగ్‌బాయి, షాడో బ్లాక్, ఫేసింగ్ ది విండ్, పిక్సెల్ ఆరెంజ్ కలర్‌లలో వచ్చింది. ఈ ఫోన్ చైనాలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
iQOO Neo 11 specifications
iQOO Neo 11 అతిపెద్ద హైలైట్ దాని
గేమింగ్-సెంట్రిక్ హార్డ్‌వేర్. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ చిప్‌సెట్‌లో కంపెనీ ఇంటర్నల్లీ డెవలప్ చేసిన మాన్స్టర్ సూపర్-కోర్ ఇంజిన్, మెరుగైన గేమింగ్ కోసం Q2 చిప్ కూడా అందించింది. iQOO Neo 11లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2K ప్యానెల్‌ను కలిగి ఉంది. 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ థర్మల్ కంట్రోల్ కోసం 8K వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది.
iQOO Neo 11 ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 3200Hz టచ్ శాంప్లింగ్ రేట్, 25.4ms టచ్ రెస్పాన్స్ టైమ్‌కు మద్దతుతో 6.82-అంగుళాల 2K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ (OIS తో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇది 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. iQOO Neo 11 కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ అల్ట్రాసోనిక్ 3D ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. iQOO Neo 11 మొబైల్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
Follow Us