/rtv/media/media_files/2025/09/10/iphone-price-cut-2025-09-10-08-22-36.jpg)
IPhone Price Cut
ప్రముఖ అమెరికన్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ నిన్న iPhone 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ iPhone 17 సిరీస్‌లో.. iPhone 17, iPhone 17 air (కొత్త మోడల్), iPhone 17 pro, iphone 17 pro maxలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఐఫోన్‌లతో పాటు, కంపెనీ అప్డేట్ చేసిన వాచ్‌లు, ఇతర వస్తువులను కూడా పరిచయం చేసింది.
iphone 17 series launch today
అయితే ఈ iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం లాంచ్ అయిన iPhone 16 నుండి iPhone 16 Plus, iPhone 16 pro, iPhone 16 pro max, iPhone 15, iPhone 15 plus వంటి మోడళ్లపై ఎవరూ ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఐఫోన్‌లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు, ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
iphone 15 and 16 series offers
iPhone 16
iPhone 16లోని 128GB స్టోరేజ్ వేరియంట్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,900కి లాంచ్ అయింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.69,990 కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ.3500 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.66,490కి కొనుక్కోవచ్చు.
iPhone 16 Plus
iPhone 16 Plusలోని 128GB స్టోరేజ్ వేరియంట్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.89,900కి ప్రారంభించబడింది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ.78,290 కి లిస్ట్ అయింది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.4500 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.73,790కి కొనుక్కోవచ్చు.
iPhone 16 Pro
iPhone 16 Proలోని 128GB స్టోరేజ్ వేరియంట్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.1,19,900 కు ప్రారంభించారు. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.1,05,690 కు లిస్ట్ అయింది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై
రూ.7500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గిపుతో iPhone 16 Proని రూ.98,190కి కొనుక్కోవచ్చు. ఈ ఐఫోన్ లాంచ్ ధర కంటే దాదాపు రూ.21,710 తగ్గుతోంది.
iPhone 16 Pro Max
iPhone 16 Pro Maxలోని 256GB స్టోరేజ్ వేరియంట్ గత సంవత్సరం రూ.1,44,900కి లాంచ్ అయింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.1,28,590 కి అందుబాటులో ఉంది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.7500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత దీనిని రూ.1,21,090 కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ లాంచ్ ధర కంటే దాదాపు రూ.23,810 తక్కువ ధరకు లభిస్తుంది.
iPhone 15
iPhone 15 లోని 128GB స్టోరేజ్ వేరియంట్ సెప్టెంబర్ 2023లో లాంచ్ సమయంలో రూ.79,900కి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఇది విజయ్ సేల్స్‌లో రూ.62,290 కు లిస్ట్ అయింది. ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.3500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపుతో iPhone 15 కేవలం రూ.58,790కి లభిస్తుంది. అంటే ఈ ఐఫోన్ లాంచ్ ధర కంటే దాదాపు రూ.21,110 తగ్గుతోంది.
iPhone 15 Plus
iPhone 15 Plusలోని 128GB స్టోరేజ్ వేరియంట్ సెప్టెంబర్ 2023లో రూ.89,900కి ప్రారంభించబడింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.66,990 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ పై రూ.3500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత దీనిని రూ.63,490కి కొనుక్కోవచ్చు. అంటే ఈ ఐఫోన్ లాంచ్ ధర కంటే రూ.21,110 చౌకగా లభిస్తుంది.