/rtv/media/media_files/2025/05/19/42zYgtyfyPAtm3TopSDe.jpg)
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఇటీవల బ్రౌజర్ డెస్క్‌టాప్ యూజర్లకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ హైలైట్ చేస్తూ సలహాని విడుదల చేసింది. గూగుల్ క్రోమ్ వాడుతున్నప్పుడు యూజర్ల పర్సనల్ కంప్యూటర్లను హ్యాకర్లు యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. దీంతో పర్సనల్ సెన్సిటీవ్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉంది. CERT-In ఈ సమస్యను హైరిస్క్ అని తెలిపింది.
🚨Google has issued an emergency Chrome update (version 136.0.7103.113/.114) to fix a critical vulnerability (CVE-2025-4664) allowing attackers to steal sensitive data.
— HackManac (@H4ckManac) May 19, 2025
-Patch now- pic.twitter.com/Dz0012vjRj
హ్యాకర్లు గూగుల్ క్రోమ్ ఓల్డ్ వర్షన్‌లో మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మీ డెస్క్‌టాప్ వెర్షన్ 136.0.7103.113 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీకు ప్రమాదం లేదు. మీరు పాత వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే వీలైనంత త్వరగా దాన్ని అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. గూగుల్ క్రోమ్ 136.0.7103.113, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో ప్రాబ్లమ్స్ పరిష్కరించింది.
ఎలా అప్‌డేట్ చేయాలి
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి మీ డెస్క్‌టాప్‌లో క్రోమ్ ఓపెన్ చేయండి.
బ్రౌజర్ టాప్‌లో రైట్ టాప్‌లో ఉన్న త్రి డాట్స్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్‌లను ఎంచుకోండి.
సెట్టింగ్‌ల మెనూలో దిగువన అబౌట్ క్రోమ్‌ను సెలక్ట్ చేసుకోండి. తర్వాత క్రిందికి స్క్రోల్ చేయండి.
బ్రౌజర్ అప్‌డేట్ అని ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
(google chrome updates | Google Chrome Users | latest-telugu-news | advice)