/rtv/media/media_files/2025/09/17/flipkart-mobile-offers-2025-09-17-11-27-55.jpg)
Flipkart Mobile Offers
Flipkart Big Bang Diwali Saleలో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. రేపు దీపావళి జరుపుకోనుండగా.. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్.. స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, మరిన్నింటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో Samsung, Vivo, Oppo, Nothing వంటి అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు Big Bang Diwali Saleలో రూ.20,000 కంటే తక్కువ ధరకు లభించే ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.
Flipkart Big Bang Diwali Sale కస్టమర్లకు Samsung, Vivo, Oppo, Nothing వంటి ప్రముఖ బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ సేల్‌లో తక్కువ ధరలను లభించే ఫోన్లలో ఒకటి Vivo T4x 5G. ఇది సేల్ సమయంలో తక్కువ ధరకు లభిస్తుంది. దీని 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ఇక్కడ భారీ డిస్కౌంట్ తో పొందొచ్చు.
Vivo T4x 5G
Vivo T4x 5Gలోని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.13,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్‌పై నడుస్తుంది.
Realme P3x 5G
Realme P3x 5G లోని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఇప్పుడు కేవలం రూ.10,249కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.72-అంగుళాల డిస్ప్లే, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
Oppo K13x 5G
Oppo K13x 5Gలోని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో కేవలం రూ.12,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది.
Samsung Galaxy F36 5G
Samsung Galaxy F36 5Gలోని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు ఈ సేల్ సమయంలో రూ.13,999 కు లభిస్తుంది. ఈ ఫోన్ Exynos 1380 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.
Follow Us