Mobile Offers: రూ.10వేల లోపు బెస్ట్ మొబైల్స్.. మోటో, శాంసంగ్, రెడ్‌మీ - ఆహా ఓహో..!

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,000 లోపు అద్భుతమైన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో Moto g35 5G రూ.8,999, vivo T4 Lite 5G రూ.9,999, POCO M7 5G రూ.9,499 ఫోన్లు మంచి ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటితో పాటు REDMI 14C 5G రూ.9,520లకు సొంతం చేసుకోవచ్చు.

New Update
Top 5G smartphones available on Flipkart under Rs 10,000

Top 5G smartphones available on Flipkart under Rs 10,000

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలని కోరుకుంటున్నారు. దీనికి చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేదు. కానీ ఖరీదైన ఫోన్‌ను కొనడం అందరికీ సులభం కాదు. అందువల్ల చాలా మంది సామాన్యులు తక్కువ ధరలో మంచి ఫీచర్లు, మన్నిక గల స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పలు కంపెనీలు చౌకైన ఫోన్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, మంచి కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది వినియోగదారులు కేవలం రూ.10 వేల లోపు ఉన్న మొబైల్ ఫోన్లనే ఇష్టపడుతున్నారు. వాటిలో పెద్ద బ్యాటరీలు, మంచి ప్రాసెసర్లు, మంచి డిజైన్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రూ.10వేలలో దొరికే ఫోన్లు ఏంటో తెలుసుకుందాం. 

Moto g35 5G

Moto G35 5G అనేది మోటరోలా సరసమైన 5G ఫోన్. దీని 4/128జీబీ అసలు ధర రూ.12,499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.8,999లకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా రూ.1000 క్యాష్ బ్యాక్ / కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు రూ.6,150 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.  

ఇది 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Unisoc T760 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది మరియు 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని సాఫ్ట్‌వేర్ దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది, ఇది దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.

vivo T4 Lite 5G

vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లోని 4/128జీబీ అసలు ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు దీనిని కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. దీనిపై రూ.6,850 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. 

ఇది 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP +2MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6000mAh బ్యాటరీతో వస్తుంది. డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 

POCO M7 5G

POCO M7 5G మొబైల్ 6/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.9,499లకే లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే రూ.6,350 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. 

6.8 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP రియర్ కెమెరా + 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5160 mAh Battery, 4 Gen 2 5G Processorను కలిగి ఉంది.

వీటితో పాటు REDMI 14C 5G రూ.9,520లకు, Infinix HOT 60i 5G రూ.9,499లకు, Samsung Galaxy F06 5G రూ.8,499లకు సొంతం చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు