/rtv/media/media_files/2025/09/30/flipkart-mobile-offers-oppo-k13x-5g-price-2025-09-30-14-56-51.jpg)
Flipkart Mobile Offers Oppo K13x 5G Price
Flipkart Big Billion Days 2025లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాల వరకు ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అందువల్ల కేవలం రూ.10 వేలలో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఈ పండుగ సేల్‌లో Oppo K13x 5G భారీ ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌లతో లభిస్తోంది. వీటిలో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. Oppo K13x 5Gలో అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
Oppo K13x 5G Price & Offer
Oppo K13x 5G మొబైల్ బేస్ వేరియంట్ 4GB+128GB ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో Axis, HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్ ట్రాన్షక్షన్లపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. ఈ డిస్కౌంట్‌తో Oppo K13x 5G ధర రూ.9,999 కి తగ్గుతుంది. అదే సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.10,010 ఆదా చేసుకోవచ్చు.
Oppo K13x 5G Specs
Oppo K13x 5G మొబైల్ 1604x720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Oppo K13x 5G ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Android 15 ఆధారంగా ColorOS 15పై నడుస్తుంది. Oppo K13x 5G ఫోన్ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Oppo K13x 5Gలో వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G NA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
Flipkart Smartphone Offers
Apple iPhone 16 (128GB) లాంచ్ సమయంలో రూ.79,900 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.51,999కి అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy S24 అసలు ధర రూ.74,999 ఉండగా.. ఇప్పుడు దాదాపు రూ.39,999 కే కొనుగోలు చేయవచ్చు.
Google Pixel 9 అసలు ధర రూ.79,999 ఉండగా.. సేల్‌లో రూ.34,999 ధర వద్ద అందుబాటులో ఉంది.
Nothing Phone (3) లాంచ్ సమయంలో రూ.84,999కి విడుదలైంది. ఇప్పుడు సేల్‌లో రూ.34,999కి కొనుక్కోవచ్చు.
Samsung Galaxy A35 (5G) విషయానికొస్తే.. ఇది లాంచ్ సమయంలో రూ.33,999తో వచ్చింది. ఇప్పుడు రూ.17,999 కొనుక్కోవచ్చు.
OPPO K13x 5G బడ్జెట్ విభాగంలో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.16,999 ఉండగా.. ఇప్పుడు రూ.9,499కి సొంతం చేసుకోవచ్చు.
టాప్ స్మార్ట్ టీవీ ఆఫర్స్
Sony Bravia (55-అంగుళాలు) ప్రీమియం 4K మోడల్స్‌పై దాదాపు రూ.35,000 వరకు తగ్గింపు ఉంది. ఈ తగ్గింపుతో సోనీ టీవీని రూ.54,990లకే కొనుక్కోవచ్చు.
Samsung (55-అంగుళాలు) Crystal 4K మోడల్‌పై మంచి తగ్గింపు ఉంది.
Motorola QLED (55-అంగుళాలు) డాల్బీ అట్మోస్ సౌండ్‌తో కూడిన మోడల్ రూ.27,999 వద్ద ఆకర్షణీయమైన ధరలో ఉంది.
LG 4K UHD టీవీలలో వివిధ మోడల్‌లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. కొన్ని 55-అంగుళాల OLED టీవీలు రూ.1,04,999 నుండి మొదలవుతాయి.