/rtv/media/media_files/2025/07/11/flipkart-goat-sale-2025-07-11-14-31-42.jpg)
FLIPKART GOAT SALE
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ‘‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’’ (GOAT SALE) సేల్‌ను రేపటి నుండి అంటే జూలై 12 నుండి ప్రారంభించనుంది. ఈ మెగా సేల్ జూలై 17 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం నేటి నుండే అంటే జూలై 11 అర్ధరాత్రి 12 AM నుండి ఈ సేల్ మొదలు కానుంది.
ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు?
ఈ GOAT సేల్‌లో అన్ని కేటగిరీల ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ సహా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
Goat Sale Smartphone Offers
Smartphones: ఐఫోన్ 16, Samsung Galaxy సిరీస్, Google Pixel, Motorola, Nothing వంటి ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు పొందొచ్చు. ఐఫోన్ 16ను కేవలం రూ.60,000 లోపు ధరకే పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ టీజర్ ద్వారా వెల్లడించింది.
ఎలక్ట్రానిక్స్: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై గణనీయమైన ఆఫర్లు ఉంటాయి.
గృహోపకరణాలు: రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ACలు, కిచెన్ అప్లయెన్స్‌లపై కూడా డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన మోడళ్లపై ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆఫర్లు, కాంబో డీల్స్ కూడా లభించవచ్చు.
ఫ్యాషన్: పురుషులు, మహిళలు, పిల్లల ఫ్యాషన్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లు, బై వన్ గెట్ వన్ (BOGO) డీల్స్, భారీ క్లియరెన్స్ డిస్కౌంట్లు ఉంటాయి.
బ్యూటీ & గ్రూమింగ్: స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, మేకప్, వెల్‌నెస్ ఉత్పత్తులపై 70% వరకు తగ్గింపు, ఆకర్షణీయమైన ఫ్రీబీ కాంబోలు లభిస్తాయి.
Goat Sale Bank offers
ఈ Goat Sale సమయంలో కొనుగోలుదారులు అదనపు డిస్కౌంట్లు, ప్రయోజనాలను పొందవచ్చు. HDFC, IDFC మరియు Axis బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10% వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది (గరిష్టంగా రూ.5,000). అలాగే నో-కాస్ట్ EMI కూడా ఉంది. SBI, ICICI, Axis, HDFC, Bajaj Finserv బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ EMI సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అన్ని ఆర్డర్‌లపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్లస్ సభ్యులు సూపర్‌కాయిన్‌లను ఉపయోగించి అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. పాత డివైజ్‌లు/గృహోపకరణాలను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.