/rtv/media/media_files/2025/10/18/flipkart-big-bang-diwali-sale-realme-p4-pro-price-drop-2025-10-18-09-13-29.jpg)
Flipkart Big Bang Diwali Sale Realme P4 Pro price drop
రియల్‌మీ ఇటీవల విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ Realme P4 Pro 5G ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ సైట్ పండుగ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో దీనిని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవాలి. అందువల్ల మీరు Realme P4 Pro 5Gని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, ధరల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Realme P4 Pro 5G offers
Realme P4 Pro 5Gలోని 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం ఆగస్టులో రూ.24,999లకు లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22,999కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో.. ఎంచుకున్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత Realme P4 Pro 5G ధర రూ.20,999 కి వస్తుంది. అంటే ఈ ఫోన్ లాంచ్ ధర కంటే రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దాదాపు రూ.17,650 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో Realme P4 Pro 5Gని కేవలం రూ.3349లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ధరను నిర్ణయిస్తారు.
Realme P4 Pro 5G specs
Realme P4 Pro 5Gలో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1280×2800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. Realme P4 Pro 5G ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మే UI 6.0పై నడుస్తుంది. Realme P4 Pro 5G వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65, IP66 రేటింగ్ తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Realme P4 Pro 5G వెనుక భాగంలో f/1.8 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.2 అపెర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/2.4 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. P4 Pro 5Gలో కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీతో వస్తుంది.