KAVERI JET ENGINE: రక్షణరంగంలో ఇండియా మరో అద్భుతం

DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్‌ ఇన్‌ ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్‌ విజయవంతమైతే.. విమానాలు రాడార్‌లు సైతం గుర్తించలేని స్పీడ్‌తో దూసుకెళ్లగలవు.

New Update
KAVERI JET ENGINE

ఇండియా శాస్త్రవేత్తలు రక్షణ రంగంలో మరో ఘనత సాధించారు. DRDO కావేరీ ఇంజిన్‌ను స్వతహాగా రూపొందించింది. కావేరీ ఇంజిన్ ఇన్‌ ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. రష్యాలో కావేరీ ఇంజిన్‌కు టెస్ట్‌కు ఏర్పాటు చేస్తున్నారు. కావేరీ ఇంజిన్ జెట్ ఇంజిన్‌ దేశీయంగా తయారు చేయడంలో ఇది కీలక అడుగు మారనుంది.

ఇప్పటివరకూ రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్ దగ్గరే జెట్ ఇంజిన్ తయారీ టెక్నాలజీ ఉంది. ఈ ఇంజిన్లను UCAV ఘాటక్ విమానాల్లో అమర్చేందుకు ఇండియన్ సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంజిన్‌ విజయవంతమైతే.. విమానాలు రాడార్‌లు సైతం గుర్తించలేని స్పీడ్‌తో దూసుకెళ్లగలవు. దీంతో రక్షణ రంగంలో భారత్‌ గొప్పశక్తిగా ఎదగగలదు.

Kaveri engine | russia | latest-telugu-news | india pak war | india defence | latest telugu movie releases

Advertisment
Advertisment
తాజా కథనాలు