/rtv/media/media_files/2025/09/26/iphone-offers-2025-09-26-14-40-53.jpg)
iphone offers
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ కంట్రోల్‌జెడ్ (ControlZ ) నేటి నుండి ‘‘Great Value Days sale’’ ప్రకటించింది. ఈ సేల్‌లో అతిపెద్ద ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో వినియోగదారులు ఐఫోన్లు సహా ఇతర కంపెనీ ఫోన్లను అతి తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది.
ఈ Great Value Days sale వినియోగదారులకు తగ్గింపు ధరలకు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో అతి తక్కువ ధరలకే పొందవలసిన ప్రొడెక్టుల గురించి తెలుసుకుందాం.
IPhone Offers
Great Value Days saleలో IPhone 12, IPhone 13 series, IPhone 14 series పై భారీ తగ్గింపు లభిస్తోంది.
iPhone 12 లాంచ్ సమయంలో రూ.79,900 ఉండగా ఇప్పుడు ఈ సేల్‌లో కేవలం రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 12Pro లాంచ్ సమయంలో రూ.1,19,900 ఉండగా.. ఇప్పుడు రూ.29,999లకే కొనుక్కోవచ్చు.
iPhone 13 (128జీబీ) లాంచ్ సమయంలో రూ.79,999లకు రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సేల్‌లో దీన్ని కేవలం రూ.24,999లకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 13 Pro లాంచ్ సమయంలో రూ.1,19,900 ఉండగా.. ఇప్పుడు కేవం రూ.44,999లకే కొనుక్కోవచ్చు.
iPhone 14 లాంచ్ సమయంలో రూ.79,900లకు ఉండగా.. ఇప్పుడు రూ.29,999లకు లభిస్తోంది.
iPhone 14 Pro లాంచ్ సమయంలో రూ.1,29,900 ఉండగా.. ఇప్పుడు కేవం రూ.54,999లకే కొనుక్కోవచ్చు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇవన్నీ Refurbished iPhones (పునరుద్ధరించిన ఐఫోన్లు). అంటే గతంలో ఉపయోగించిన ఐఫోన్లను చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాటిని సరిచేసి మార్కెట్‌లో తక్కువ ధరలకు అమ్ముతారు.
వన్‌కార్డ్, HDFC బ్యాంక్ EMI లావాదేవీలపై 5% తక్షణ తగ్గింపు (రూ.2,500 వరకు) తర్వాత ఈ ధరలు లభిస్తున్నాయి. బజాజ్ కార్డ్ ద్వారా అదనపు EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14.. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 2532 x 1170 పిక్సెల్‌లు, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. ఈ ఐఫోన్ హెక్సా-కోర్ A15 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌గా నడుస్తుంది. ఈ ఐఫోన్ 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఇది ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.
Iphone 13.. 1170x2532 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.10-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఐఫోన్ హెక్సా-కోర్ ఆపిల్ A15 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. వెనుక కెమెరాలో 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు కెమెరాలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.