/rtv/media/media_files/2025/08/07/chatgpt-privacy-issue-2025-08-07-10-39-20.jpg)
ChatGPT Privacy Issue
ChatGPT Privacy Issue: ఇటీవల కొంతమంది యూజర్లు గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్లలో తమ ChatGPT సంభాషణలు కనిపిస్తున్నాయని గుర్తించారు. సాధారణంగా ప్రైవేట్‌గా ఉండే ఈ చాట్లు ఇలా బయటకు రావడంతో అంతా షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను chatGPTని అడిగినవారు ఇప్పుడు దీనిపై ఎక్కువగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TechCrunch నివేదిక ప్రకారం, కొన్ని సందర్భాల్లో యూజర్లు "షేర్ చేయదగిన లింక్"(Shareable Link) ఆప్షన్‌ను ON చేసుకోవడం వల్ల ఆ చాట్లు పబ్లిక్‌గా మారాయని తెలుస్తోంది. దీని వల్ల గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్లు వాటిని ఇండెక్స్ చేసి, సెర్చ్ ఫలితాల్లో చూపించాయి.
Also Read: ఏలియన్స్ వస్తున్నాయి.. సౌరకుటుంబంలోకి కొత్త గ్రహం
ChatGPT Chats Leaked on Google..
ఈ నేపథ్యంలో OpenAI సెక్యూరిటీ హెడ్ డేన్ స్టక్కీ(Dane Stuckey) స్పందిస్తూ, “ఈ ఫీచర్‌ను పూర్తిగా తీసివేస్తున్నాం. ఇది తాత్కాలిక ప్రయోగం మాత్రమే. ఉపయోగకరమైన సంభాషణలు ఇతరులకు కనిపించాలన్న ఉద్దేశంతోనే ఇది తయారు చేశాం. కానీ నిజానికి యూజర్స్ ప్రైవేట్ విషయాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మేము ఈ ఎంపికను తీసేసాం,” అని తెలిపారు.
ఆగస్టు 1న ఆయన ట్వీట్ చేస్తూ, “ప్రత్యేకంగా సెర్చ్ ఇంజిన్లలో ఇండెక్స్ అయిన కంటెంట్‌ను తొలగించేందుకు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ మార్పులు అన్ని యూజర్లకు ఈ వారం చివరినాటికి వర్తించనున్నాయి” అని చెప్పారు. అంతేకాకుండా, “భద్రత, గోప్యత (privacy) మా ప్రధాన లక్ష్యాలు. అందుకే దీన్ని మెరుగుపర్చేందుకు మేము నిరంతరం పని చేస్తున్నాం” అని వెల్లడించారు.
Also Read: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తుంది.. ధర, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు భయ్యా!
ఇంతకముందు OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్(Sam Altman) కూడా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఒకవేళ మీరు చాలా వ్యక్తిగతమైన ప్రశ్నలు ChatGPTని అడుగుతున్నారంటే, అది పూర్తిగా ప్రైవేట్‌గా ఉండదని గుర్తుంచుకోండి. అవసరమైతే, మీ చాట్ లోని సమాచారం లీగల్ ప్రాసెస్‌లో కూడా వాడే అవకాశం ఉంది,” అని హెచ్చరించారు.
కనుక వినియోగదారులు తమ వ్యక్తిగత డేటా గోప్యతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ChatGPT వాడుతున్నప్పుడు షేర్ లింకులు, ప్రైవసీ సెట్టింగులు గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.