Kitchen Items offer: మీ దగ్గర రూ.100 ఉంటే చాలు.. మార్కెట్‌లో ఉన్న కిచెన్ ఐటెమ్స్ మీ ఇంట్లోకే.. ఎలాగంటే?

రూ.100 ఉంటే ఇంట్లో కిచెన్‌కు సంబంధించిన అన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ వెజిటేబుల్ క‌ట‌ర్, వాల్ ఫోన్ హోల్డర్, 3డీ గ్యాల‌క్సీ క్రిస్టల్‌ బాల్ నైట్ లైట్, 3 పిన్ ట్రావ‌ల్ అడాప్టార్, యూఎస్‌బీ ఫ్యాన్ రూ.100 కంటే తక్కువకు లభిస్తాయి.

New Update
offers

offers

ఈ రోజుల్లో ఏదైనా చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. బయటకు కొనడానికి వెళ్లినప్పుడు రూ.100 పెడితే కనీసం ఏం రాదని కొందరు ఫీల్ అవుతుంటారు. కానీ కేవలం రూ.100 ఉంటే చాలు.. ఇంటికి కావాల్సిన ఎన్నో వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇంటికి సంబంధించిన కొన్ని బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవేంటో మరి మీరు కూడా తెలుసుకుని కొనుగోలు చేయాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

ఇది కూడా చూడండి: Arattai app: వాట్సాప్‌కు పోటీగా ఇండియా యాప్.. సేమ్ టూ సేమ్

ప్లాస్టిక్ వెజిటేబుల్ క‌ట‌ర్

దీనివల్ల ఇంటి పనులు తొందరగా అవుతాయి. ముఖ్యంగా డైలీ కిచెన్‌లో కట్ చేసే ఉల్లిపాయ నుంచి కురగాయలు అన్నింటిని కూడా ఈజీగా కట్ చేయవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, దోసకాయ, అల్లం, మిరపకాయలు వంటి వాటిని కట్ చేసుకోవచ్చు. అయితే దీని ధర ప్రస్తుతం అమెజాన్‌లో  రూ.79గా ఉంది. అయితే ఇందులో కటింగ్ మందాన్ని కూడా మార్చుకోవచ్చు. దీనికి ఒక రొటరీ బటన్ ఉంటుంది. ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్ చాలా పదునుగా ఉండి, ఎక్కువకాలం మన్నుతుంది. ఈ ప్యాకేజీలో కంటైనర్, హోల్డర్, పుషర్ కూడా ఉంటాయి. ఈ ధరకి ఇంత బెస్ట్ కటర్ దొరకడం కష్టం. 

వాల్ ఫోన్ హోల్డర్

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ స్టాండ్ పేరుతో దొరికే ఈ హోల్డర్ ధర రూ. 119 డిస్కౌంట్‌లలో రూ.100 లోపు దొరుకుతుంది). ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు నేలపై లేదా అడ్డదిడ్డంగా పెట్టకుండా, సురక్షితమైన స్టాండ్‌గా గోడకు తగిలించుకోవచ్చు. అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లకి ఇది సరిపోతుంది. ఇది టైల్స్, గ్లాస్, చెక్క, మెటల్ వంటి చాలా రకాల ఉపరితలాలపై ఉపయోగించడానికి వీలవుతుంది. దీని వెనుక ఉన్న హై పవర్ సెల్ఫ్ అడ్హీసివ్ వల్ల ఇన్‌స్టాలేషన్ చాలా సులభం.

3డీ గ్యాల‌క్సీ క్రిస్టల్‌ బాల్ నైట్ లైట్

ఇది రూ. 100 లోపు లభించే ఒక అందమైన అలంకరణ వస్తువు. దీని ధర కేవలం రూ. 99 మాత్రమే. క్రిస్టల్‌తో తయారు చేసిన ఈ బాల్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. దీనిలో 3D లేజర్ ఎంగ్రేవింగ్ టెక్నాలజీని వాడారు. ఇందులో ప్లానెట్స్ (గ్రహాల) రూపం త్రీ-డైమెన్షనల్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. సోలార్ సిస్టమ్ LED నైట్ లైట్ లాంటి ఇది బెడ్‌రూమ్, స్టడీ రూమ్, ముఖ్యంగా పిల్లల గదికి మంచి లైటింగ్‌ను ఇస్తుంది.

3 పిన్ ట్రావ‌ల్ అడాప్టార్

ఎక్కువ‌గా ప్రయాణం చేసేవారికి ఈ అడాప్టర్ చాలా అవసరం. దీని ధర రూ. 98 మాత్రమే. ఇది వివిధ రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌ల‌తో పనిచేసేలా డిజైన్ చేయబడింది. చాలా తేలికగా ఉంటుంది కాబట్టి బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పవర్ రిసీవ్ అవుతున్నప్పుడు చూపించే లైట్ ఇండికేటర్ కూడా ఉంటుంది. రోజువారీ ఉపయోగాలకు, ప్రయాణాలకు ఇది చాలా బాగా సరిపోతుంది.

యూఎస్‌బీ ఫ్యాన్

వేసవిలో లేదా చిన్నపాటి గాలి అవసరమైనప్పుడు ఈ మినీ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ. 85 మాత్రమే. దీనిని USB కేబుల్ ద్వారా లేదా బ్యాటరీ ద్వారా కూడా ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. ఇది చిన్న సైజులో ఉండటం వలన ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఫ్యాన్ బ్లేడ్, బాడీ TPE మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఇది కూడా చూడండి: Ear Buds Offers: చీప్ ధరకే రిచ్ లుక్ ఇయర్‌బడ్స్.. దీని స్పెషల్ ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

Advertisment
తాజా కథనాలు