/rtv/media/media_files/2025/04/08/gem9J7ef6K1CPU3A6OHn.jpg)
Ambrane Stylo N10, Stylo N20 powerbanks
మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా?.. మాటిమాటికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం వస్తుందా?.. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరకే కిర్రాక్ పవన్ బ్యాంక్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. అంబ్రేన్ స్టైలో కంపెనీ రెండు కొత్త పవర్ బ్యాంక్‌లను విడుదల చేసింది. అవే Ambrane Stylo N10, Stylo N20. వీటిలో స్పెషల్ బూస్టెడ్ స్పీడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.
Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
ఇవి USB-A, టైప్-C పోర్ట్‌లకు మద్దతుతో వస్తాయి. ఇవి 22.5W ఛార్జింగ్ స్పీడ్‌ను కలిగి ఉంటాయి. స్టైలో N10 10,000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే స్టైలో N20 సామర్థ్యం 20,000mAhగా ఉంది. ఇవి రబ్బరు ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇప్పుడు వాటి ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
అంబ్రేన్ స్టైలో N10, స్టైలో N20 పవర్‌బ్యాంక్ ధర
అంబ్రేన్ స్టైలో N10 పవర్‌బ్యాంక్ 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 999గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో స్టైలో N20 పవర్‌బ్యాంక్ 20,000mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధరను కంపెనీ రూ.1599గా నిర్ణయించింది. ఈ రెండూ 6 నెలల వారంటీతో వస్తాయి. కంపెనీ ఈ పవర్ బ్యాంక్‌ను నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తాయి. వీటిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ambraneindia.com నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ పవర్ బ్యాంకులను Amazon.in, Blinkit వంటి ఆన్‌లైన్ రిటైలర్ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
Ambrane Stylo 22.5W N10 10000mAh and N20 20000mAh power banks with PD, PPS support launched https://t.co/BA018zGwPn pic.twitter.com/XzwuFyDDDG
— FoneArena Mobile (@FoneArena) April 4, 2025
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
స్పెసిఫికేషన్లు
అంబ్రేన్ స్టైలో N10, స్టైలో N20 పవర్‌బ్యాంక్‌లు ఇన్‌పుట్, అవుట్‌పుట్ కోసం USB-A, టైప్-C పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఈ పవర్ బ్యాంక్‌లో ప్రత్యేక బూస్టెడ్ స్పీడ్ టెక్నాలజీ అందించబడింది. వీటిలో లిథియం పాలిమర్ బ్యాటరీలను ఉపయోగించారు. USB-A పోర్ట్ 22.5W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. టైప్-C పోర్ట్ 22W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ పవర్ బ్యాంక్‌లో స్మార్ట్ LED ఇండికేటర్ కూడా ఉంది. వీటిపై కంపెనీ 6 నెలల వారంటీ ఇస్తోంది.
Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
(telugu-news | latest-telugu-news | power bank offers | today-news-in-telugu | latest technology news in telugu)