Amazon Mobile Offers: రూ.62వేల ఫోన్ మరీ ఇంతచీపా.. పరుగులెడుతున్న కస్టమర్లు..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. గతంలో పండుగ సీజన్‌ సమయంలో పలు ఆఫర్లు అందించి కస్టమర్లను ఉత్సాహపరిచిన అమెజాన్‌ ఇప్పుడు ప్రసిద్ధ కంపెనీ OnePlus మొబైల్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

New Update
OnePlus 11 5G Offers

OnePlus 11 5G Offers

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. గతంలో పండుగ సీజన్‌ సమయంలో పలు ఆఫర్లు అందించి కస్టమర్లను ఉత్సాహపరిచిన అమెజాన్‌ ఇప్పుడు ప్రసిద్ధ కంపెనీ OnePlus మొబైల్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. OnePlus ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఒకటైన OnePlus 11 5Gని కొనుగోలు చేయాలనుకుంటే.. అది చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి అన్ని వివరాలను తెలుసుకుందాం. 

OnePlus 11 5G Offers

OnePlus 11 5G అమెజాన్ లో 35% తగ్గింపుతో లిస్ట్ అయింది. దీంతో OnePlus 11 5G ని Amazon లో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 16GB RAM + 256GB స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.61,999 కాగా.. ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్ కింద కేవలం రూ.39,990 కి లభిస్తుంది. అంటే దాదాపు రూ.22,000 ప్రత్యక్ష తగ్గింపు పొందొచ్చు.

బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. OnePlus 11 5Gతో బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. Amazon Pay Balance ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,999 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఇది రూ.37,991కి తగ్గుతుంది. అంటే మొత్తం రూ.24,008 తగ్గింపు పొందొచ్చు. కాగా ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. 

OnePlus 11 5G specs

OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లేలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 పై నడుస్తుంది. ఈ ఫోన్ ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది పెద్ద 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 100W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

Advertisment
తాజా కథనాలు