/rtv/media/media_files/2025/11/12/google-pixel-8-price-drop-2025-11-12-15-27-38.jpg)
Google Pixel 8 price drop
మీరు ఒక మంచి కెమెరా ఫోన్ ను కొనుక్కోవాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారా?. కానీ అధిక ధరల కారణంగా మీ ప్లాన్ మార్చుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై Amazonలో భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు. పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా ధరను మరింత ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు Google Pixel 8 ఆఫర్‌లు, ధర, స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.
Google Pixel 8 price and offers
Google Pixel 8లోని 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ అక్టోబర్ 2023లో రూ.75,999కి ప్రారంభించబడింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.38,499కి అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తగ్గింపు (రూ.3,000 వరకు) ఉంటుంది. దీని తర్వాత Google Pixel 8 ధర రూ.35,499కి చేరుకుంది. అంటే డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.40,500 తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే మీ పాత ఫోన్‌ను మార్చుకోవడం వల్ల మీకు రూ.36,350 ఆదా అవుతుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్ట ప్రయోజనం మార్పిడి చేస్తున్న ఫోన్ పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Google Pixel 8 specifications
Google Pixel 8 స్మార్ట్ ఫోన్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ Google Pixel 8లో ఇంటిగ్రేట్ చేశారు. కెమెరా వారీగా చూసుకుంటే.. Google Pixel 8లో 50-మెగాపిక్సెల్ ఆక్టా-PD ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. Google Pixel 8 స్మార్ట్‌ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4575mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
Follow Us