/rtv/media/media_files/2025/09/27/amazon-mobile-offers-2025-09-27-18-44-03.jpg)
Amazon Mobile Offers
అమెజాన్‌లో ‘‘Great Indian Festival Sale 2025’’ జోరుగా సాగుతోంది. ఈ సేల్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన అవకాశం. ఇందులో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ సైట్ ఈ OnePlus ఫోన్‌పై భారీ ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. OnePlus 13R పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్‌లు, ఆఫర్‌ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
OnePlus 13R 5G Price
OnePlus 13R 5Gలోని 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి చేసే చెల్లింపులపై రూ.2,000 వరకు తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత OnePlus 13R 5G ఫోన్ రూ.35,999 కు వస్తుంది. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.36,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
అయితే ఈ ఆఫర్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ మెరుగైన స్థితిలో ఉండాలి. మోడల్ బట్టి ధరను నిర్ణయిస్తారు. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 2025లో రూ.42,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది.
OnePlus 13R 5G Specs
OnePlus 13R 5G ఫచర్ల విషయానికొస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2780x1264 పిక్సెల్స్ రిజల్యూషన్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల ఫుల్ HD+ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. OnePlus 13R 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15.0పై నడుస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో.. 5G, 4G LTE, డ్యూయల్-సిమ్ (నానో-సిమ్), Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS వంటివి ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. OnePlus 13R 5Gలో వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్ ఉన్నాయి. OnePlus 13R 5G ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.