/rtv/media/media_files/2025/10/15/mobile-offers-2025-10-15-14-58-54.jpg)
Amazon Great Indian Festival Diwali Special సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నారు. అందువల్ల మీరు అతి తక్కువ ధరలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. మీ బడ్జెట్ రూ. 8,000 కంటే తక్కువ ఉండి.. మీరు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ సేల్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇటీవలే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించి అదిరే ఆఫర్లు అందించింది. ఇప్పుడు ఈ సేల్ పూర్తికావడంతో దివాళీ సేల్ పేరుతో మరొక కొత్త సేల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్ లు సహా మరెన్నో ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. అందులో Samsung చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M06 5G పై భారీ తగ్గింపును అందిస్తోంది. ధర తగ్గింపుతో పాటు, కస్టమర్లు క్రెడిట్ కార్డుల ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. Samsung Galaxy M06 5G పై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌లు, ధర గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Samsung Galaxy M06 5G offers
Samsung Galaxy M06 5G లోని 4GB RAM + 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ.9,499 కు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.7,999 కు లిస్ట్ చేయబడింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆ తర్వాత ప్రభావవంతమైన ధర తగ్గుతుంది. మరోవైపు పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇవ్వడం ద్వారా ధరను రూ.7550 వరకు తగ్గించవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్ట ప్రయోజనం పూర్తిగా ప్రస్తుత పరిస్థితి, స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Samsung Galaxy M06 5G specs
Samsung Galaxy M06 5G 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 800 nits వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. Samsung Galaxy M06 5G మొబైల్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా One UI 6.0పై నడుస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. Galaxy M06 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. Samsung Galaxy M06 5G ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, USB టైప్-C పోర్ట్, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi, బ్లూటూత్ v5.3 వంటివి ఉన్నాయి.