/rtv/media/media_files/2025/08/02/71st-national-film-awards-2025-2025-08-02-12-39-37.jpg)
71st National Film Awards 2025
డైరెక్టర్ సుకుమార్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన కెరీర్ లెక్కల టీచర్ నుంచి డైరెక్టర్‌గా ఎదిగిన తీరు అత్యద్భుతం. సుకుమార్ మొదట గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత సినిమా ఫ్యాషన్, ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో అల్లు అర్జున్‌తో తన తొలి చిత్రం ‘ఆర్య’ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్‌గా నిలిచారు.
71st National Film Awards 2025
ఇప్పుడు ఆయన కుమార్తె కూడా సుకుమార్ అడుగు జాడల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆమె నటించిన మొదటి చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ఈ మూవీలోని అద్భుతమైన నటనకుగానూ సుకృతి వేణికి ఉత్తమ బాల నటి అవార్డును అందుకున్నారు.
#Sukumar Daughter "Sukriti Banreddi" - Wins National Award as BEST CHILD ARTIST 👏#NationalAwards#71NationalAwardspic.twitter.com/zfhpfb47uV
— Filmy Bowl (@FilmyBowl) August 1, 2025
ఈ అవార్డు సుకృతి వేణి భవిష్యత్తుకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. సుకుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సుకృతి తన నటనతో జాతీయ స్థాయిలో ఈ అవార్డును గెలుచుకోవడం ఎంతో గర్వకారణం అనే చెప్పాలి.
ఆమె నటించిన తొలి సినిమా ‘గాంధీ తాత చెట్టు’ విషయానికొస్తే.. ‘మహానటి’, ‘బృంద’ వంటి చిత్రాలకు రచయిత్రిగా పని చేసిన దర్శకురాలు పద్మావతి మల్లాది ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించగా.. ఆమె తాతయ్య పాత్రలో ఆనంద్ చక్రపాణి కనిపించారు. వీరితో పాటు రాగ్ మయూర్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రఘురామ్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. సుకుమార్ భార్య, సుకృతి తల్లి తబితా ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇది ఒక సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ సినిమాను అహింస సిద్ధాంతాలు, పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశాలుగా తీసుకుని రూపొందించారు.
ఈ చిత్రం సుకృతి కెరీర్‌లో మొదటిది అయినప్పటికీ.. ఆమె సహజమైన యాక్టింగ్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా అలరించింది. ఇలాంటి ఒక సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన సుకృతి.. తన మొదటి సినిమాకే నేషనల్ స్థాయి అవార్డు అందుకోవడం విశేషం అనే చెప్పాలి.