Hyderabad Crime: గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. పుప్పాలగూడలో ఓ కంపెనీలో యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఆమెను మరో యువతి ద్వారా సిద్దార్థ్ వర్మ పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించారు.
దీంతో ఆ యువతిని బుధవారం రాత్రి భోజనానికి రమ్మని ఇంటికి పిలిచాడు. ఆ క్రమంలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించాడు. ఆ తరువాత ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
Also read: పారిస్ ఒలింపిక్స్ లో నేటి నుంచి అథ్లెటిక్స్..ఆశలన్నీ కూడా నీరజ్ పైనే!