Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా !

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్‌ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది.

New Update
Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా !

Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌ పేట్‌లో రేవంత్ సర్కార్‌ స్కిల్‌ యూనివర్సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీగా ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రాను నియామకం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్‌ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదా?: అయితే, ఈ నంబర్ కు వివరాలు వాట్సాప్ చేయండి!

ఇదిలాఉండగా ఇటీవలే హైదారాబాద్‌లో ఉన్న మహీంద్ర యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కానీ రేవంత్ కేబినేట్ విస్తరణ పనుల్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ సీఎం రేవంత్‌ ఆరోజు సాయంత్రం తన నివాసంలో ఆనంద్‌ మహీంద్రాను కలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

Advertisment
తాజా కథనాలు