IND Vs AFG:క్లీన్ స్వీప్ చేస్తే...టీమ్ ఇండియా ఖాతాలోకి మరో రికార్డ్..

ఈరోజు ఆఫ్ఘాన్, ఇండియాల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తే టీ20 చరిత్రలో అత్యధిక వైట్ విష్‌లు చేసిన జట్టుగా రికార్డ్‌ల్లోకి ఎక్కుతుంది.

IND Vs AFG:క్లీన్ స్వీప్ చేస్తే...టీమ్ ఇండియా ఖాతాలోకి మరో రికార్డ్..
New Update

Cricket:భారత క్రికెట్ ప్లేయర్ల కోసం మరో రికార్డ్ వెయిట్ చేస్తోంది. టీ 20 ఫార్మాట్‌లో కొత్త చరిత్రను లిఖించేందుకు టీమ ఇండియా ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆఫ్ఘాన్ తో ఆడే మూడో టీ20 మ్యాచ్‌లో ఙండియా గెలిచి క్లీన్ స్వీప్ చేస్తే...భారత్ కొత్త రికార్డ్‌ను నెలకొల్పుతుంది. టీ20 చరిత్రలో అత్యధిక వైట్ వాష్‌లు చేసిన జట్టుగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన టీ20 సీరీస్‌లలో టీమ్ ఇండియా, పాకిస్తాన్‌లు అత్యధిక వైట్ వాష్ చేసిన జట్లుగా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సీరీస్‌లో భారత జట్టు క్లీన్ స్వీప్ చేస్తే అత్యధిక వైట్ వాష్‌లు చేసిన జట్టుగా రోహిత్ సేన నిలుస్తుంది.

Also read:పాక్‌ మీద ఇరాన్ దాడులు..తీవ్రపరిణామాలు తప్పవంటున్న పాక్

ఈరోజు బెంగళూరులో మూడో మ్యాచ్...

ఈరోజు ఆఫ్ఘాన్‌తో మూడో టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లె గెలిచిన టీమ్ ఇండియా మూడోది కూడా సొంతం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. ప్రపంచకప్‌ ముందు టీమ్ ఇండియాకు ఈ విక్టరీ కీలకంగా మారనుంది. దూకుడే మంత్రంగా ఆడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో 17.3 ఓవర్లకు 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే.. రెండో మ్యాచ్‌లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని అందుకని మ్యాచ్ గెలుచుకుంది.

చితక్కొట్టుడే లక్ష్యంగా...

బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విజృంభిస్తోంది టీమ్ ఇండియా. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆఫ్ఘాన్ నుంచి అసలు పోటీనే లేకుండా పోయింది. దాదాపు అందరూ బ్యాట్స్‌మెన్ రానిస్తున్నారు. కోహ్లీ కూడా 81 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం వరుసగా విఫలం అయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో అందరి దృష్టీ అతని మీదే ఉంది. ఈ మ్యాచ్ లో అయిన ఆకెప్టెన్ రాణిస్తాడా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఇక బాదుడే లక్ష్యంగా ఆడుతున్న భారత జట్టు ఇప్పుడు మూడో మ్యాచ్‌లో కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చును...

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. నిలకడగా ఆడుతున్న జట్టులో ఎటువంటి ప్రయోగాలు చేయకపోవచ్చునని అంటున్నారు. ఇక కెట్‌కీపర్‌గా సంజు శాంసన్‌కు అవకాశమిస్తారా లేదా అన్నది చూడాలి. మరోవైపు బౌలింగ్‌లో మార్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించే అవకాశముంది. ముకేశ్‌ కుమార్‌ స్థానంలో అవేష్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు లభించొచ్చు.

బెంగళూరు పిచ్..

బెంగళూరు చిన్న స్వామి స్టేడియం చాలా చిన్నది. బౌండరీలు ఇట్టే వస్తాయి. పరుగులకు పెట్టింది పేరు. అయితే అస్సలు పరుగులు రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ప్రపంచకప్‌లో అయిదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియంలో ఈసారి కొత్త పిచ్‌పై మ్యాచ్‌ జరగనుంది. అయితే ఎప్పటిలా పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలే ఎక్కువ అని చెబుతున్నారు క్యూరేటర్లు.

తుది జట్లు(అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కోహ్లి, శివమ్‌ దూబె, జితేశ్‌ శర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌/కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌/అవేష్‌ ఖాన్‌

అఫ్గానిస్థాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, గుల్బదీన్‌ నైబ్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబి, నజీబుల్లా జద్రాన్‌, కరీమ్‌ జనత్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ

#bengaluru #cricket #afghanistan #india #t2o
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe