/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/apsrtc-jpg.webp)
విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్టు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఆ మ్యాచ్ లో యువ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ తన అద్భుత ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని..స్కోర్ బోర్డును పరుగు పెట్టించారు. మొత్తానికి టీమిండియా భారీ స్కోర్ చేసింది.
APSRTC Buses being used by Team India and Team England cricket teams for the second test at Visakhapatnam
Thank you for patronising us @bcci @englandcricket#INDvsENGTest pic.twitter.com/AOPUvNtQ0v
— APSRTC (@apsrtc) February 2, 2024
అయితే విశాఖ సాగర తీరంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో టీమిండియా క్రికెటర్లతోపాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఏపీఎస్ ఆర్టీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక…అన్ని మర్చిపోయారు..!!