IND vs ENG:హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొత్తానికి ఫామ్ లోకి వచ్చాడు. చాలా కాలం తర్వాత టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

IND vs ENG:హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ
New Update
India vs England Rohit Sharma Century :వరల్డ్ కప్ తర్వాత డీలా పడిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మొత్తానికి మళ్ళీ పుంజుకున్నాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో అస్సలు ఏమీ ఆడని రోహిత్ మూడో మ్యాచ్ లో మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. రాజ్‌కోట్‌లో (Rajkot) ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే మూడు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తరువాత వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజాలు (Ravindra Jadeja) మాత్రం క్రీజులో పాతుకుపోయారు. రోహిత్ అయితే కీలకమయిన కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు. 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు కోట్టి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత రోహిత్ టెస్ట్‌ల్లో శతకం సాధించాడు. హిట్ మ్యాన్ కు తోడుగా జడేజా 68 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 190/3 గా ఉంది.

33 పరుగులకే మూడు వికెట్లు...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (Team India) మొదట్లోనే కుప్పకూలిపోయింది. మొదట రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. రోహిత్ సంయమనంతో ఆడుతలున్న అవతి ఎండ్‌లో మాత్రం వికెట్లు టపటపా పడిపోయాయి. మూడో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. 10 పరుగులు చేసి మైదాననాన్ని వీడాడు. ఆ తరువాత వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌దీ అదే పరిస్థితి. గిల్ అయితే అసలు కాతా కూడా ఓపెన్ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇతని తర్వాత మొదటిసారి టెస్టుల్లోకి అరంగ్రేటం చేసిన రజత్ పాటిల్ తన సత్తా చూపించలేకపోయాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్లీ బౌలింగ్‌లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్‌ అవుటయ్యాడు. దీంతో బారత జట్టు 8 ఓవర్లలో 33 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తరువాత వచ్చిన జడేజా, క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మలు మాత్రం భారత జట్టును ఆదుకున్నారు.

తుదిజట్లు:
టీమిండియా:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటీదార్‌, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

Also Read:International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్

#rohit-sharma #cricket #england #india-vs-england
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe