Atma Sakshi Survey: ఏపీలో టీడీపీదే విజయం.. ఆత్మసాక్షి సర్వే చెప్పిన లెక్కలు ఇవే..!!

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ఎన్నికల వ్యూహరచనలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ భారీ విజయంతో అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడించింది. 54శాతం ఓట్ల అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెప్పింది. మరి అధికారపార్టీ వైసీపీ సంగతి ఏంటి..? సర్వే ఏం చెప్పిందో చూద్దాం.

New Update
Atma Sakshi Survey: ఏపీలో టీడీపీదే విజయం.. ఆత్మసాక్షి సర్వే చెప్పిన లెక్కలు ఇవే..!!

Atma Sakshi Survey on AP Elections: ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ఎన్నికల వ్యూహరచనలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ భారీ విజయంతో అధికారంలోకి (TDP Wins in AP Election)వస్తుందని సర్వేలో వెల్లడించింది. 54శాతం ఓట్లతో అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెప్పింది. మరి అధికారపార్టీ వైసీపీ సంగతి ఏంటి..? సర్వే ఏం చెప్పిందో చూద్దాం.

జగన్ పాలనపై ఆత్మసాక్షి సర్వే (Atma Sakshi Survey) నిర్వహించింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీదే పైచేయి అని సర్వేలో తేలింది. ఆత్మ సాక్షి సర్వే ప్రకారం..ప్రస్తుతం వైసీపీ (YSRCP) కంటే టీడీపీకి 3శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయని సర్వేలో వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేసింది. అయితే రానున్న ఎన్నికల్లో మొత్తానికి టీడీపీ విజయాన్ని ఎవరూ అపలేరని సర్వే తేల్చి చెబుతోంది.

ఆత్మసాక్షి సర్వేలో ఏం చెప్పిందో ఇక్కడ క్లిక్ చేసి చూడండి.  AP SURVEY AS ON 30.09.2023

కాగా 2019 ఎలక్షన్స్ లో జగన్ (YS Jagan) పార్టీ 175 అసెంబ్లీ సీట్లలో ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం ఓట్లలో దాదాపు 50శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం 39శాతం ఓట్లతో 29స్ధానాలకే మాత్రమే పరిమితమైంది. రెండు పార్టీల మధ్య 11శాతం ఓట్ల తేడా ఉంది. అయితే ఆత్మ సాక్షి సర్వే ప్రకారం ఇప్పుడంతా మారిపోయింది. రెండేళ్ల క్రితం ఇదే సర్వేలో  వైసీపీ కంటే టీడీపీకే 4శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అంటే టీడీపీ 54శాతం ఓట్లు ఉంటే వైసీపీ 43శాతం మాత్రమే ఉంది. అంటే దాదాపు 11శాతం ఓట్లు టీడీపీకి ఎక్కువగా వచ్చాయి.

ఇది కూడా చదవండి: ఏపీలో తగ్గని వైసీపీ హవా…టైమ్స్ నౌ సంచలన సర్వే…వివరాలివే..!!

మొత్తానికి ఏపీలో టీడీపీదే విజయం ఖాయమని ఆత్మసాక్షి సర్వే చెబుతుండగా...జాతీయ ప్రముఖ వార్త సంస్థ టౌమ్స్ నౌ (Times Now) మాత్రం దీనికి విరుద్ధంగా సర్వే  ఫలితాలను తాజాగా వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందని సంచలన సర్వేలో పేర్కొంది. దాదాపుగా ఎంపీ స్థానాల్లో వైసీపీదే హవా అని స్పష్టం చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) ప్రజలు సానుభూతి చూపించారు. కానీ అది ఓట్ల విషయానికి వస్తే మాత్రం జగన్ జై కోట్టారని తన సర్వేలో వెల్లడించింది. అటు జనసేన పవన్ కల్యాన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో మాదే అధికారం అంటూ సభలు పెట్టి..సమావేశాలు నిర్వహించి ఊదరగొడుతున్నా..జనసేన ప్రభావం మాత్రం జీరో అని తేల్చేసింది టైమ్స్ నౌ.

ఇది కూడా చదవండి:  నేడు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. ఏం జరగబోతోంది?

చివరిగా ఆత్మసాక్షి టీడీపీదే విజయం అంటుంటే..జాతీయ సర్వేలు మాత్రం జగన్ అధికారంలోకి రావడం పక్కా అంటున్నాయి. ఈ గందరగోళానికి తెరపడాలంటే ఎన్నికలు పూర్తయి...ఫలితాలు వస్తేనే స్పష్టమవుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు