Atma Sakshi Survey: ఏపీలో టీడీపీదే విజయం.. ఆత్మసాక్షి సర్వే చెప్పిన లెక్కలు ఇవే..!!
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ఎన్నికల వ్యూహరచనలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ భారీ విజయంతో అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడించింది. 54శాతం ఓట్ల అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెప్పింది. మరి అధికారపార్టీ వైసీపీ సంగతి ఏంటి..? సర్వే ఏం చెప్పిందో చూద్దాం.