పొత్తు బంధాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి టీడీపీ, జనసేనలు. దీని కోసం తొందరగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే పార్టీల సమస్వయ కమిటీ మీటింగ్ ను నిర్వహించాలని కోరుకుంటున్నాయి. కమిటీ సభ్యుల నియామకాల మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ కసరత్తులు ప్రారంభించారని సమాచారం. దీని కోసం సీనియర్ నేతలతో చర్చిస్తుననారని తెలుస్తోంది. ఇక సమన్వయ సమావేశ బాధ్యతలు నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. తెలంగాణ నుంచి కూడా ఒక సభ్యుడిని పెట్టనున్నారని అంటున్నారు.
మరోవైపు టీడీపీ తరుపున కూడా సమస్వయ సభ్యుల నియామకం జరుగుతోందని చెబుతున్నారు. టీడీపీ ముఖ్య అధినేత లోకేశ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆ పార్టీ సమస్వయ కమిటీ సభ్యులను ప్రకటించనున్నారు. ివి పూర్తయ్యాక నెలాఖరులోపు మొదటి సమావేశం నిర్వహిస్తారని ఇరు వర్గాల నేతలు చెబుతున్నారు.