Rajya Sabha Elections : ఆంధ్ర రాజకీయాలు(Andhra Politics) రగులుతున్నాయి. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) తో పాటు అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ఉండడంతో పార్టీల నడుమ యుద్ద వాతావరణం నెలకొంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని అక్కడి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఏపీ రాజకీయాలు ఢిల్లీ(Delhi) లో జరుగుతున్నాయి. అదేంటి అనుకుంటున్నారా?.. అలా అనడానికి ప్రధాన కారణం ఏపీలోని ముఖ్య పార్టీల అధినేతలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపడమే.
రాజ్యసభకు టీడీపీ దూరం?
రాజ్యసభ ఎన్నికల్లో(Rajya Sabha Elections) పోటీకి టీడీపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉండటంతో పోటీ వద్దని ఆ పార్టీ సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే 42 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. కానీ వారి ఎమ్మెల్యేల సంఖ్య బలం అంత లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ భావిస్తోందట.
Also Read : Delhi: ముగిసిన జగన్-మోడీ భేటీ.. వీటిపైనే సుదీర్ఘ చర్చ?
మా పార్టీలో చేరండి ప్లీజ్...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఏపీలో తమ పార్టీ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్న అధికార వైసీపీ.. గెలిచే అవకాశం లేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ, జనసేనలకు కలిసి వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి పార్టీల్లో చేర్చుకుంటున్నాయి టీడీపీ, జనసేనలు. త్వరలో తమ పార్టీలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరుతారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి వారి ఆశలు ఆవిరి అవుతాయా? లేదా చిగురిస్తాయా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
మాకు జగనే కావాలి...
తమ పార్టీలోకి భారీగా వైసీపీ నేతలు త్వరలో చేరనున్నట్లు ప్రచారాలు చేసుకుంటున్న టీడీపీ, జనసేన(TDP-Janasena) పార్టీలకు అసంతృప్తి నేతలు షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. దీనికి కారణం మొదట్లో వైసీపీ(YCP) పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాకు జగనే కావాలని అంటున్నారట. ఇదిలా ఉండగా.. వారంతా ఇప్పుడు తమకు మద్దతిస్తారా లేదా అనే డైలమాలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని యోచనలో ఉన్నట్లు సమాచారం.