/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-01-at-1.09.41-PM-jpeg.webp)
Kadapa : కడప జిల్లా రాజంపేట(Rajampet) లో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పొలిటికల్ హీట్(Political Heat) బాగా పెరిగిపోయింది. ఎన్నికలు(Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీల్లో నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా టీడీపీ(TDP) లో ఈ అసంతృప్తి జ్వాలలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు టీడీపీ నుంచి టికెట్ అశించారు. కానీ అతనికి కాకుండా టీడీపీ అధిష్టానం సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్‌ను కేటాయించింది. దీంతో చెంగల్రాయుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
రాజంపేటలో బల ప్రదర్శన..
బత్యాల చెంగల్రాయుడి(Bathyala Changal Rayudu) కి టికెట్ రాకపోవడంతో అతని అనుచరులు మండిపడుతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే బయటపెడుతున్నారు. రాజంపేటలో బత్యాల అనుచరుల భారీ బల ప్రదర్శనకు పూనుకున్నారు. వేలాదిగా అనుచరులు ,అభిమానులు తరలివచ్చి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సుగవాసి వద్దు.. బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పట్టణంలోని ఎస్ఆర్ కల్యాణ మండపం నుంచి భారీ ర్యాలీ చేస్తున్నారు. ఈ ర్యాలీకి సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, వీరబల్లి మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. రాయచోటి వాసికి టికెట్ ఇచ్చి రాజంపేట కార్యకర్తల గొంతు కొయొద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.
Also Read:Delhi: తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ముగిసిన కసరత్తు