AP politics : ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్

మరికొన్ని నెలల్లో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం అక్కడ రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇందులో టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది టీడీపీ.

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయం పంపిన చంద్రబాబు
New Update

TDP Target Fix : ఏపీ(AP) లో ఎన్నికల్లో పుంజుకునేందుకు టీడీపీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకమైన 18 అంశాలను ఎంపిక చేసి వాటి గురించి ప్రజలకు చెప్పాలని డిసైడ్ అయ్యారు. దీని పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు. దీంతో పాటూ వచ్చే ఎన్నికల్లో అంశాలవారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇప్పటికే ప్రకటించిన మినీ మేనిఫెస్టోని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చలు చేస్తున్నారు.

Also Read : అచ్చోసిన ఆంబోతులు”…కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ(TDP) ఎన్నికల వ్యూహంలో భాగంగా వెనుకబడిన వర్గాల సమన్వయ బాధ్యతను పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్రలకు అప్పగించారు. అలాగే పయ్యావుల కేశవ్‌కు సోషల్‌ మీడియా, భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని.. నిమ్మల రామానాయుడికి అప్పగించారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల బాధ్యతను బీసీ జనార్దన్‌రెడ్డికి ఇవ్వగా యువ ఓటర్లను ఆకర్షించడం, వారు ఓటు వేసేలా స్ఫూర్తి నింపే కార్యక్రమాల పర్యవేక్షణను రామ్మోహన్‌నాయుడికి కేటాయించారు.

పై వాటితో పాటూ ఓటరు జాబితాల పరిశీలన, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై పోరాటం అంశాలను జీవీ ఆంజనేయులుకు, ఉద్యోగులు, పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి అంశాల్ని అశోక్‌బాబుకు ఇచ్చారు. రాజధాని అమరావతి వ్యవహారాలు, ఉద్యమం బాధ్యతను నక్కా ఆనందబాబుకు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ, సర్పంచుల సమస్యలపై పోరాటం అంశాన్ని రాజేంద్రప్రసాద్‌కి అప్పగించారు. పార్టీలోకి చేరికల అంశాన్ని అనగాని సత్యప్రసాద్‌కు అప్పగించిన చంద్రబాబు..న్యాయ వ్యవహారాలు, కేసులపై పర్యవేక్షణను ధూళిపాళ్ల నరేంద్రకు అప్పగించారు. ఇక బలహీన పోలింగ్‌ కేంద్రాల్ని రవికుమార్‌కి, చంద్రబాబు పర్యటనలకు సంబంధించిన బాధ్యతల్ని పెందుర్తి వెంకటేష్‌కు అప్పగించారు.

ఇక పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతూ..రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనతో తమ పార్టీ కలిసందని చెప్పారు. ప్రభుత్వం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి భవిష్యత్‌కు దారిచూపాలి కానీ ప్రస్తుత ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకుంటోందన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు. ఇప్పటికే బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నఆమని తెలిపారు. డిసెంబర్ 20 తర్వాత నియోజకవర్గాల్లో పర్యటిస్తానని..ప్రజలను నేరుగా కలిసి వారికేం కావాలో ఆలోచించి మరిన్ని హామీలిస్తామన్నారు చంద్రబాబు.

Also Read : బీసీ సీట్లలో ఎందుకు పోటీ చేస్తున్నారు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్!

#elections #politics #tdp #ap-ex-cm-chandrababu #andhra-radesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe