TDP VS Janasena: నరసాపురంలో తలనొప్పిగా మారిన టీడీపీ- జనసేన పొత్తు

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల మధ్య టికెట్‌ వార్‌ నడుస్తుంది. నరసాపురం టికెట్‌ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ లేక కొత్త పల్లి సుబ్బారాయుడేకే టికెట్‌ అంటూ అందరూ అనుకుంటుండగా.. తెరమీదకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు వచ్చింది.

New Update
AP: టీడీపీ - జనసేనలో మొదలైన ముసలం.. పెత్తనం కోసం ముదురుతున్న వైరం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో కీలక మార్పలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల మధ్య టికెట్‌ వార్‌ నడుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు మాకంటే మాకు అంటూ తన్నుకు చస్తున్నారు. ఈ క్రమంలోనే నరసాపురం టికెట్‌ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.

జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ లేక కొత్త పల్లి సుబ్బారాయుడేకే టికెట్‌ అంటూ అందరూ అనుకుంటుండగా.. అనూహ్యంగా తెరమీదకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి , మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు వచ్చింది. టీడీపీ నుంచి నరసాపురం టికెట్‌ తనకే అంటూ వారు ప్రకటించడంతో మరోసారి జనసేన-టీడీపీ మధ్య వైరం బయటపడింది.

ఇదిలా ఉంటే వీరందరినీ కాదు అని ఎన్‌ఆర్‌ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌ నాయుడు కు నాకే టికెట్‌ అంటూ తెరమీదకి వచ్చారు.
ఇటీవల అనుచరులతో సమావేశమైన కొవ్వలి రామ్మోహన్ నాయుడు. 2014లో టికెట్ ఇస్తామని చంద్రబాబు మొండిచెయ్యి చూపారు.
ఇప్పుడు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడంలేదని కార్యకర్తలతో ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే పవన్ సమక్షంలో జనసేనలో చేరిన సుబ్బారాయుడు. పొత్తులో భాగంగా జనసేన టికెట్ కొత్తపల్లిదే అంటున్న ఆయన అనుచరులు.

పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌కు టికెట్‌ ఇవ్వడంగురించి టీడీపీ నేతలు చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్‌కు సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. అనకాపల్లి సీటు జనసేన నుంచి కొణతాలకు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పీలా గోవింద్‌కు టికెట్‌ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు.

పెడనలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన బూరగడ్డ వేదవ్యాస్‌ చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. రాయచోటిలో రాంప్రసాద్‌ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో రమేష్‌ రెడ్డి వర్గీయులు కొందరు పార్టీకి రాజీనామా చేశారు. పెనుకొండలో సవితకు టికెట్‌ ఇవ్వడంతో విబేధాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం జెండాలకు నిప్పు పెట్టారు పార్థసారథి వర్గీయులు.

Also read: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీ మాగుంట!

Advertisment
Advertisment
తాజా కథనాలు