Andhra Pradesh : పిఠాపురంలో ఫ్లెక్సీల వార్.. పిఠాపురంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ జరుగుతోంది. ఫ్లెక్సీలతో ఫైట్ చేసుకుంటున్నారు. జనసేన, వైసీపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తూ రాత్రికి రాత్రే ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలవాలి అనే దాని మీద రగడ జరుగుతోంది. By Manogna alamuru 13 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Flexy War At Pithapuram : పార్టీల మధ్య పొత్తులు ఉన్నా పట్టించుకునేదే లేదు అంటున్నారు పిఠాపురం(Pithapuram) జనం. టీడీపీ(TDP). జనసేన(Janasena) మధ్య ఉన్న పొత్తును పక్కన పెట్టేసి మరీ కొట్టుకుంటున్నారు. డైరెక్ట్ యుద్ధాలకు దిగకపోయినా...ఫ్లెక్సీ(Flexy) ల ద్వారా వ్యతిరేకతను చాటుకుంటున్నారు. పిలిస్తే పలికేవాడు... స్ధానికుడికే నా ఓటు... అంటూ రాత్రికి రాత్రే పిఠాపురంలో ఫ్లెక్సీలు వెలిసాయి. జనసేన, వైసీపీ(YCP) అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను రూపొందించారు. పిఠాపూరం నుంచి పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో పాటూ మరోవైపు జనసేన టికెట్‌ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆశిస్తున్నారు. ఉదయ్ స్వస్థలం రాజమండ్రి రూరల్‌లోని కడియం. మరోవైపు ఇక్కడ టికెట్ రేసులో జనసేన నేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కూడా ఉన్నారు. ఇతను పిఠాపురం వాసే. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ నుంచి వంగా గీత పోటీ చేస్తారని అంటున్నారు. గీతది కాకినాడ రూరల్. అంతకు ముందు ఇక్కడ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం దొరబాబుది కూడా కాకినాడ రూరలే. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు నాన్ లోకల్స్‌దే అవుతోంది. అయితే ఈసారి లోక్లస్ ఇక్కడ గెలవాలని పట్టుదలగా ఉన్నారు. అందులో టీడీపీ నుంచి ఉన్ స్థానిక ఇన్ఛార్జ్ వర్మ పిఠాపురంలో గెలిచి చూపించాలని ఉవ్వీళ్ళూరుతున్నారు. లోకల్, నాన్ లోకల్ వివాదం.. ఈసారి ఎన్నికల్లో లోకల్ వాళ్ళే గెలవాలని కొత్త నినాదం కనిపిస్తోంది. ఏపార్టీ వాళ్ళు అయినా బయటి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదని గ్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దాని కోసమే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వెలిసాయని అంటున్నారు. టీడీపీ నేత వర్మ, జనసేన నేత పిల్లా శ్రీధరే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. Also Read : Hyderabad : జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం..మహిళా కార్పొరేటర్‌పై దాడి #andhra-pradesh #ycp #tdp #pithapuram #janasena #flexy-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి