Andhra Pradesh : పొత్తు సరే.. సీట్లు ఎలా? నేతల్లో గుబులు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. కానీ దీని వల్ల లోకల్ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది. తమకు రావాల్సిన సీటు ఎక్కడ రాకుండా పోతుందో అని భయపడుతున్నారు.

New Update
Andhra Pradesh : పొత్తు సరే.. సీట్లు ఎలా? నేతల్లో గుబులు

TDP, Janasena, BJP Alliance : టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు(TDP-Janasena-BJP Alliance) వల్ల నేతల్లో సీటుపై గుబులు మొదలయింది. తమకు సీట్లు ఎక్కడ కేటాయిస్తారనేది తెలియక తికమక పడుతున్నారు.కొన్ని ప్రాంతాల్లో ఇప్పుటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది. దాంతో పాటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందో తెలియడం లేదు. వాళ్ళు ఎక్కడ తమ స్థానల నుంచి పోటీ చేస్తామని అడుగుతారో అని టీడీపీ,జనసేన నేతలు భయపడుతున్నారు.

రాజమండ్రి సిటీ, పి గన్నవరం అభ్యర్ధులు..

రాజమండ్రి(Rajahmundry) సిటీ, పి గన్నవరం రెండు చోట్ల పోటీకి బీజేపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల టికెట్లను తమ పార్టీ వాళ్ళని నిలబెట్టాలని అనుకుంటోంది. అయితే టీడీపీ ఇప్పటికే ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు పి గన్నవరం టీడీపీ అభ్యర్థి విషయంలో పార్టీలో అసంతృప్తి నెలకొంది. దీంతో బరి నుంచి తప్పుకుంటానని పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపల్లి రాజేష్ చెప్పారు. అలాగే  రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం స్థానాలపై కూడా బీజేపీ ఎఫెక్ట్ పడనుంది.రాజమండ్రి సిటీ సీటు కోసం బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రాజమండ్రి రూరల్ విషయంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య గొడవ జరుగుతోంది. ఇప్పుడు అందులోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. రాజమండ్రి రూరల్ సీటు టీడీపీకి కేటాయించి...అక్కడ ఉన్న జనసేన అభ్యర్థికి నిడదవోలు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. రాజమండ్రిలో టీడీపీ బలంగా ఉండడంతో...బీజేపీని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక తలల పట్టుకుంటున్నారు అధినేతలు.

Also Read : National : జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ నివేదిక

Advertisment
తాజా కథనాలు