/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-56.jpg)
TDP Sensational Comments on YS Jagan: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేసింది. 'లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్‌కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు' అంటూ పేర్కొంది. రూ.39 లక్షల సచివాలయ ఫర్నిచర్ అందులోనే ఉందని.. అలాగే ఎలక్ట్రిక్, సెక్యూరిటీ ఏర్పాట్లు, మెయింటెనెన్సు కింద కోట్లు ఖర్చు చేశారంటూ పోర్కొంటూ ఓ ఫొటోను జతచేసింది. ఇప్పటివరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read: అవి నా కళ్ళారా చూశాను.. పవన్ కల్యాణ్ సంచలన లేఖ!
లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు.#FurnitureDongaJagan#AndhraPradeshpic.twitter.com/3AFkKvOOjK
— Telugu Desam Party (@JaiTDP) June 15, 2024