JC Diwakar: టికెట్ చిచ్చు.. జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్?

టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్. ఈ క్రమంలో చంద్రబాబును కలవగా టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే జేసీ దివాకర్ పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ జరుగుతోంది.

JC Diwakar: టికెట్ చిచ్చు.. జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్?
New Update

JC Diwakar Reddy: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీ వైసీపీ గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇంఛార్జిల నియామకం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు లిస్టులని ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఐదో లిస్టుపై కసరత్తు చేస్తోంది. టీడీపీ అధినేత ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా .. జనసేన కూడా ఇద్దరిని ప్రకటించింది.

ALSO READ: జనసేన..టీడీపీ.. ఔర్ బీజేపీ.. ఏమవుతోంది?

అన్నకు ఓకే.. తమ్ముడికి నో..

ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందుకోసం 175 స్థానాల్లో గెలిచే వారినే అభ్యర్థులుగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం స్థానాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది అని ఆ పార్టీ నేతలు కోడైకూస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుతో జేసీ ఫ్యామిలీలో చీలిక జరిగిందనే టాక్ వినిపిస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్‌రెడ్డి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.అలాగే.. జేసీ దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌కు మొండిచేయి ఇచ్చేలా కనిపిస్తోంది.

అల్లుడుకి ఇవ్వండి ప్లీజ్..

జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనంతపురం ఎంపీ సీటు కోసం జేసీ పవన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిశారు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి. ఈసారి టిక్కెట్‌ ఇచ్చేది లేదని చంద్రబాబు ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాయదుర్గం టిక్కెట్‌ను తన అల్లుడు దీపక్‌రెడ్డికి కేటాయించాలని లోకేష్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరుతున్నారట. అయితే.. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం పయనం ఎటనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

Also Read: ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్.. 

DO WATCH:

#mp-elections-2024 #chandrababu #tpd-mla-list #tdp #ap-elections-2024 #jc-diwakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి