పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయకేతనం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని అన్నారు. ఏపీని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దొంగలపై వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ' ఇది అధికారం కోసం పెట్టుకున్న పొత్తు కాదు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు మాతో చేతులు కలపాలి. హైదరాబాద్‌కు మించి మిన్నగా రాజధాని ఉండేలా అమరావతికి రూపకల్పన చేశాం.
Also read: అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ మంత్రులకు బాలయ్య వార్నింగ్
అరాచక పాలన నడుస్తోంది
2029కి విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. పొలవరం ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుటు రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది. ఏ ముఖ్యమంత్రి అయిన అభివృద్ధి పనులతో పరిపాలిస్తారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అరచకాలతో పాలన కొనసాగిస్తున్నారు. వైసీపీ వేధింపులు భరించలేక.. క్రికెటర్ హనుమ విహారి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే కూడా సోషల్ మీడియాలో ఆమె పుట్టుకపై వేధింపులకు గురి చేశారు. ఇలాంటి ఘటనలే జగన్ మానసిక స్థితికి నిదర్శనం. అందుకే వైసీపీని ఓడించి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి.
అభివృద్ధిపై బ్లూ ప్రింట్ ఉంది
జగన్ 25 ఎంపీలను గెలిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని.. తెచ్చారా. కుప్పంలో నిళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ చీటింగ్ టీమ్. వైనాట్ 175 కాదు.. వైనాట్ పులివెందుల ?. టీడీపీకి అగ్నికి పవన్ కల్యాణ్ వాయువులా తోడయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ-జనసేన కలిశాయి. ఈ సభను చూశాక మా విజయాన్ని ఎవరూ ఆపలేరని అర్థమైంది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా దగ్గర బ్లూప్రింట్ ఉంది. పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో సంపదను సృష్టిస్తాం. ఇక ఆంధ్రప్రదేశ్ అన్‌స్టాపబుల్. పార్టీల పొత్తుల వల్ల కొందరు నేతలు ఇబ్బంది పడొచ్చు. పార్టీ కోసం పనిచేసిన అందరికీ కూడా న్యాయం చేస్తామని' చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై?