Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు
New Update

Palnadu : ఏపీ(AP) లోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్(High Tension) కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు(House Arrest) చేస్తున్నారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, వెల్దిర్తిలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేటలో హౌస్ అరెస్టు చేశారు.

Also Read: సినీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. 10 రోజులు థియేటర్స్ బంద్!

పిడుగుకాళ్లలో టీడీపీ(TDP) అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేటలో వైసీపీ(YCP), టీడీపీ అభ్యర్దులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చదలవాడ అరవిందబాబులు హౌస్ అరెస్ట్ అయ్యారు. నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. ముగ్గురి కన్నా ఎక్కువగా మంది గుమికూడొద్దని.. ఎక్కడా కూడా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు సూచించారు. ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం

#telugu-news #palnadu #ap-politics #section-144 #house-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe