టీకాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ఫిక్స్! ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సర్వేలు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్ధులనే ఎంపిక చేసినట్లు సమాచారం. By Manogna alamuru 22 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ అభ్యర్ధుల లిస్ట్ మీద స్క్రీనింగ్ కమిటీ చేస్తున్న కసరత్తులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. నిన్న, ఈరోజు సుదీర్ఘంగా ఈ విషయం మీద కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. టికెట్ కేటాయింపులలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ కుమార్ మధ్య చాలా వాడీవేడిగా చర్చలు జరిగనట్లు సమాచారం. సామాజిక సమీకరణలు, ఆర్ధి, రాజకీయ అంశాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారని తెలుస్తోంది. దాదాపు 60 శాతం అంగీకారంతో అభ్యర్ధుల లిస్ట్ తయారైందని చెబుతున్నారు. ఈ తొలి జాబితాను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి చేరవేయనుంది. ఈ నెలాఖరు లేదా అక్టోబరు మొదటి వారంలో తొలి జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. మొత్తం 119 స్థానాలకు గానూ 70 కి పైగా స్థానాల్లో ిఫ్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న నేతల జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపిపాలని తెలంటాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట రెబల్స్ తయారవకుండా, అభ్యర్ధులలో అసంతృప్తులు రాకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. దాని కోసమే మూడు రోజులు సుదీర్ఢ చర్చలు జరిగాయని చెబుతున్నారు. అవసరం అయితే వచ్చే వారం మరోసారి తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ మళ్ళీ సమావేశం అవుతుందని అంటున్నారు. స్క్రీనింగ్ కమిటీ సింగిల్ నేమ్ తో కేంద్ర ఎన్నికల కమిటీ కి పంపే జాబితా: -------------------------------- 1. కొడంగల్ - రేవంత్ రెడ్డి 2. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి 3.కోదాడ - పద్మావతి 4. మధిర - భట్టి విక్రమార్క 5. మంథని - శ్రీధర్ బాబు 6. జగిత్యాల - జీవన్ రెడ్డి 7. ములుగు - సీతక్క 8. భద్రాచలం - పొడెం వీరయ్య 9. సంగారెడ్డి - జగ్గారెడ్డి 10. నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి 11. అలంపూర్ - సంపత్ కుమార్ 12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి 13. కామారెడ్డి - షబ్బీర్ అలీ 14. పాలేరు - తుమ్మల నాగేశ్వరరావు 15. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి 16. పరిగి - రామ్మోహన్ రెడ్డి 17. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్ 18. మహేశ్వరం - చిగురింత పారిజాత 19. ఆలేరు - బీర్ల ఐలయ్య 20. ఖైరతాబాద్ - రోహిన్ రెడ్డి 21. దేవరకొండ - వడ్త్య రమేష్ నాయక్ 22. వేముల వాడ - ఆది శ్రీనివాస్ 23. ధర్మపురి - లక్ష్మణ్ 24. జడ్చర్ల - అనిరుద్ రెడ్డి 25. హుజూరాబాద్ - బల్మూర్ వెంకట్ 26. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్ 27. కోరుట్ల. జువ్వాడి నర్సింగ్ రావు 28.అచ్చంపేట - వంశీకృష్ణ 29 జహీరాబాద్ - ఏ. చంద్రశేఖర్ 30. ఆందోల్ - దామోదర రాజనర్సింహ 31.మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు 32. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు 33. ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి 34. వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ 35. భూపాల పల్లి - గండ్ర సత్యనారాయణ #telangana #elections #meeting #candidates #india #leaders #final-list #screening-committee #tcongress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి