Bigboss 7:అందరినీ ఎలిమినేట్ చేసి చివరికి ఈ వారం తేజానే వెళ్ళిపోయాడు..సందీప్ కౌంటర్

బిగ్ బాస్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగుర్ని బయటకు పంపించాడు టేస్టీ తేజ. భస్మాసుర హస్తం అని పేరు తెచ్చుకున్న తేజ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. దీని మీద సందీప్ మాస్టర్ ఇన్స్టా పోస్ట్ పెట్టారు.

New Update
Bigboss 7:అందరినీ ఎలిమినేట్ చేసి చివరికి ఈ వారం తేజానే వెళ్ళిపోయాడు..సందీప్ కౌంటర్

ఇప్పటి వరకూ బిగ్ బాస్ సీజన్ 7లో 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే అందులో ఆరుగురు తేజా నామినేషన్‌తో ఎలిమినేట్ అయ్యారు.దీంతో తేజా నామినేషన్ అంటే అందరూ భయపడే రేంజ్ కు వచ్చేశారు. హౌస్ మేట్స్ కూడా తేజా మీద జోకులు వేస్తున్నారు. మూడోవారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభశ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.. ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడోవారం నుంచి ఎనిమిద వారం వరకూ వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే ఈ వారం తేజానే ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీని మీద గత వారం తేజా వల్ల బయటకు వచ్చేసిన సందీప్ రియాక్ట్ అయ్యాడు.

Also Read:మేం ఇక్కడ ఆడలేం బాబోయ్.. ఢిల్లీ కాలుష్యానికి స్టార్‌ క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి!

తేజ ఎలిమినేషన్ దాదాపు కన్ఫామ్ అంటున్నారు. ఇదే విషయాన్ని సందీప్ మాస్టర్ కూడా కన్ఫామ్ చేశాడు. అందర్నీ ఎలిమినేట్ చేస్తూ చివరికి తనే ఎలిమినేట్ అయ్యాడు అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. పాజిటివ్ వైబ్స్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. దీన్ని బట్టి తేజా మీద సందీప్ మాస్టర్ ఎంత కసిగా ఉన్నాడో తెలుస్తోంది.

గత వారం సందీప్ మాస్టర్ ఎలిమినేషన్‌కి కారణం తేజాని. సందీప్‌ని స్ట్రాంగ్ అనే కారణంతో నామినేట్ చేశాడు. సందీప్ కూడా దాన్ని పాజిటివ్‌గానే తీసుకున్నాడు. తీరా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తరువాత.. హౌస్‌లో బాంబ్ పేల్చాడు తేజా. సందీప్ మాస్టర్ కావాలనే తనని అడిగి మరీ నామినేట్ చేయించున్నాడని సోమవారం నాటి నామినేషన్స్‌లో శివాజీతో చెప్పాడు తేజా. అయితే దానిపై రియాక్ట్ అయిన సందీప్.. తేజాగాడు పెద్ద ఫేక్ గాడు.. నామినేట్ చేసింది కాకుండా నేనే నామినేట్ చేయమన్నానని పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. హౌస్‌లో లేని వాడి గురించి ఇలాంటి మాట్లాడటం కరెక్ట్ కాదు.. ఈ ఒక్క పాయింట్ చాలు వాడ్ని హౌస్ నుంచి బయటకు లాక్కుని రావడానికి అని మండిపడ్డాడు సందీప్.

Advertisment
తాజా కథనాలు