Nara Bhuvaneswari, Brahmani: నెక్స్ట్ టార్గెట్ భువనేశ్వరి, బ్రహ్మణి.. అరెస్ట్ ఖాయమా?

స్కిల్ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రిమాండ్‌లో ఉండగా.. తాజాగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో అమరావతి రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ కూడా అరెస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం.

Nara Bhuvaneswari, Brahmani: నెక్స్ట్ టార్గెట్ భువనేశ్వరి, బ్రహ్మణి.. అరెస్ట్ ఖాయమా?
New Update

Bhuvaneswari, Brahmani : స్కిల్ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chandrababu) ఇప్పటికే రిమాండ్‌లో ఉండగా.. తాజాగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari), కోడలు బ్రహ్మణి(Brahmani)ల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో అరెస్ట్‌ చేయడానికి సీఐడీ సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే 11 బృందాలు కేసు దర్యాప్తులో ముమ్మరంగా ముందుకెళ్తున్నాయి. అమరావతి రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ అరెస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం.

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అనేక ప్రయోజనాలు కల్పించారని, అమరావతి రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చడం ద్వారా హెరిటేజ్‌కు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారని సీఐడీ ఆరోపిస్తోంది.ఈ కేసులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ఏ6గా పేర్కొంది. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైస్‌ చైర్‌పర్సన్‌, ఎండీగా... చంద్రబాబు కోడలు, లోకేష్‌ భార్య బ్రాహ్మణి ఎక్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా ఉన్నారని, వారి ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌ వ్యవహారాలను చంద్రబాబు, లోకేష్‌(lokesh)లు నడిపిస్తున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్‌లో ఈ కుటుంబానికి 56 శాతంపైగా షేర్లు ఉన్నాయనీ, సంస్థ డైరెక్టర్ల బోర్డంతా కుటుంబ ఆధిపత్యంలోనే నడుస్తోందనీ, అమరావతి ఇన్నర్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి చంద్రబాబు, లోకేష్‌లు క్విడ్‌ ప్రో కోకు పాల్పడ్డారనీ న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో సీఐడీ పేర్కొంది. ఈ కేసులో సిట్‌ అధికారులు కీలకమైన 129 ఆధారాలను గుర్తించినట్లుగా కూడా సీఐడీ చెబుతోంది. అప్పటి అధికారులు, అలైన్ మెంట్ లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు చేశామని పేర్కొంది. పక్కా పన్నాగంతోనే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్‌లో మార్పులు చేశారనీ, హెరిటేజ్‌ సంస్థకు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారనీ సీఐడీ అధికారులు వాదిస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో లోకేష్ కుట్ర సుస్పష్టం అంటున్న సీఐడీ... ఏ14గా లోకేష్‌ పేరు చేరుస్తూ హైకోర్టులో ఇప్పటికే మెమో కూడా దాఖలు చేసింది. ఇక ఇదే కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉన్నారు.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ఖరారులో భాగంగా.. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ లింగమనేని రమేష్‌ కుటంబంతో క్విడ్‌ప్రోలో భాగంగా భారీ భూదోపిడికి పాల్పడ్దారన్నది ప్రధాన ఆరోపణ. క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట​ నివాసాన్ని దక్కించుకోగా.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ హోదాలో లోకేష్‌ భూములు కొల్లగొట్టారన్నది సీఐడీ వాదన. అయితే ఈ క్రిడ్‌ప్రోకో జరిగిన సమయంలో లోకేష్‌ కేవలం హెరిటేజ్‌ డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారు. కానీ ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉన్నారు. దాంతో.. ఈ కేసులో భువనేశ్వరి, బ్రాహ్మణి అరెస్ట్‌ తప్పదనీ చర్చ జరుగుతోంది.

ఇక సీఐడీ వాదనలకు తగినట్లుగానే కొందరు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. తాజాగా మంత్రి రోజా.. చంద్రబాబు అవినీతి ఫ్యామిలీ ప్యాకేజ్‌ అంటూ ఆరోపించారు. చంద్రబాబు కుటుంబమంతా టీమ్ వర్క్‌గా దోపిడీలో భాగస్వామ్యం అయ్యిందని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు చేసిన పాపాలకు భువనేశ్వరి కూడా శిక్ష అనుభవించక తప్పదు అన్నట్లుగా రోజా వ్యాఖ్యానించారు. ఇక తాజాగా వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో సంచలనం. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు, లోకేష్‌ లతో పాటూ నారా బ్రాహ్మణి, భువనేశ్వరిల పేర్లు కూడా సీఐడీ మెమో ఫైల్‌ చేసినట్లు తమకు సమాచారం అందిందని, దీనిపై ఎలా పోరాడాలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల్నింటి నేథ్యంలో చంద్రబాబు, లోకేష్‌లనే కాకుండా మొత్తం చంద్రబాబు కుటుంబాన్నే సీఐడీ టార్గెట్‌ చేసిందన్నది స్పష్టమవుతోంది.

Also Read: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ ములాఖత్

#nara-lokesh #tdp #chandrababu #bhuvaneshwari #brahmani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe