బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో సన్నిహిత సన్నివేశాల్లో నటించిన అనుభవాలపై బోల్డ్ బ్యూటీ తనుశ్రీ దత్తా ఓపెన్ అయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తాను ఎంతో ఇబ్బందిపడ్డానని చెప్పింది. అంతేకాదు మొదట్లో ఆయనెవరో తెలియకముందే క్లోజ్ సీన్స్ చేయమని చెప్పినపుడు చెమటలు పట్టేశాయని, ఫస్ట్ మూవీ మొత్తం భయం భయంగానే కంప్లీట్ చేసినట్లు తెలిపింది.
Also read :Kohli Vs Gambhir: ‘అది నా హక్కు…’ కోహ్లీతో గొడవ..! గంభీర్ అసలు తగ్గట్లేదుగా!
నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా ఆప్నే’తోనే మంచి విజయాన్ని అందుకున్నాను. అయితే ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ఈ సినిమాలో మా ఇద్దరిపై తెరకెక్కించిన ముద్దు సన్నివేశాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. నిజానికి ఆ ముద్దు సీన్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఇబ్బందిపడ్డా. ఎందుకంటే, ఇమ్రాన్‌ను నేను మొదటి నుంచి ఒక నటుడిగానే చూశా. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఆయనతో కిస్ సీన్స్ చెమటలు పట్టేశాయి. చాలా కంగారుగా అనిపించింది. కాకపోతే టీమ్ అందరూ సపోర్ట్ చేయడంతో నటించగలిగాను. ‘చాక్లెట్’ మూవీలోనూ మా ఇద్దరి కిస్ సీన్స్ ఉన్నాయి. కాకపోతే ఎడిటింగ్‌లో తీసేశారు' అని చెప్పింది.
అలాగే ఆరోజుల్లో ఇమ్రాన్‌కు బాలీవుడ్‌లో కిస్సర్ - బాయ్ ఇమేజ్ ఉండేది. నాకు తెలిసినంత వరకూ ఆయన అలాంటి వ్యక్తి కాదు. ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి ఆయన కూడా ఎంతో ఇబ్బందిపడతారు. ఇమ్రాన్ హష్మీతో నేను దాదాపు మూడు చిత్రాల్లో నటించాను. అందురూ అనుకున్నట్లుగా ఇమ్రాన్ మరి అంత వైలెంట్ కాదు. చాలా సిగ్గుపడతారంటూ పలు విషయాలను గుర్తు చేసుకుంది. ఇక తనుశ్రీ తెలుగులోనూ ‘వీరభద్ర’ అనే సినిమాలోనూ ప్రేక్షకులను అలరించింది.