Speaker: చంద్రబాబు నిప్పు అయితే నిరూపించుకోవాలి టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటకు వస్తున్నాయన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ కన్నా, రాజకీయ వ్యవస్థ కన్నా, మీడియా వ్యవస్థ కన్నా పౌరుడు గొప్పవాడన్నారు. By Karthik 05 Oct 2023 in శ్రీకాకుళం రాజకీయాలు New Update షేర్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటకు వస్తున్నాయన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ కన్నా, రాజకీయ వ్యవస్థ కన్నా, మీడియా వ్యవస్థ కన్నా పౌరుడు గొప్పవాడన్నారు. చంద్రబాబు తాను ఉప్పు, పప్పు అంటున్నాడని తెలిపిన తమ్మినేని.. బాబు నిప్పు అని నిరూపించుకోవాలని, ఎవరు ఏమీటనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాము చంద్రబాబు గురించి ఎవరికీ చెప్పనవసరం లేదన్న ఆయన.. చంద్రబాబు అవినీతిపై మీడియానే ప్రజలకు వివరిస్తున్నాయన్నారు. చంద్రబాబు వేదాలు వల్లిస్తున్నారని తమ్మినేని సీతారాం తెలిపారు. అక్టోబర్ 2న దీక్ష చేయడం వల్ల సత్యాగ్రహ అర్దం పరమార్దం దెబ్బతిన్నాయన్నారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు బేయిల్ ఇవ్వమని దీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్దిక నేరగాడు సత్యాగ్రహణం చేయడం ఏంటన్న ఆయన.. చంద్రబాబు ఏమైనా దేశం కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి పరుడని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకున్నారని తమ్మనేని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే తాను సైతం అవినీతికి పాల్పడుతానని పవన్ కళ్యాణ్ పరోక్షంగా ముందే చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఆర్దమైందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు మరోసారి టీడీపీకి ఓటు వేయరని జోస్యం చెప్పారు. టీడీపీ బలహీన స్థితిలో ఉందన్న తమ్మినేని సీతారాం.. టీడీపీ పగ్గాలు పవన్ కళ్యాణ్ తీసుకున్నారన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు జైల్లో కూర్చొని పవన్ చేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. #pawan-kalyan #ycp #tdp #chandrababu #janasena #tammineni-sitaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి