DMK:డీఎంకే కి కొత్త అర్థం చెప్పిన బీజేపీ నేత!

డీఎంకే అంటే ఎంటో కొత్త అర్థం చెప్పుకొచ్చారు. డీ అంటే డెంగ్యూ, ఎమ్ అంటే మలేరియా, కే అంటే కోసు (దోమ) వీటిని వెంటనే నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.

New Update
DMK:డీఎంకే కి కొత్త అర్థం చెప్పిన బీజేపీ నేత!

గత కొద్ది రోజుల నుంచి తమిళ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో ప్రధానాంశంగా ఉంది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలే. ఆయన వ్యాఖ్యలను ఆయన తండ్రి, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా సమర్థించడంతో విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఈ విషయం పై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియోలో డీఎంకే అంటే ఎంటో కొత్త అర్థం చెప్పుకొచ్చారు. డీ అంటే డెంగ్యూ, ఎమ్ అంటే మలేరియా, కే అంటే కోసు (దోమ) వీటిని వెంటనే నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.

డీఎంకేలో జరుగుతున్న డ్రామాలు అందరికీ తెలుసుని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పీఠం ఎక్కిన మొదటి రోజు నుంచే సనాతన ధర్మం పట్ల వ్యతిరేకత చూపించారని, రెండో ఏడాదిలో ఏమో దానిని నిర్మూలించాలన్నారు. మూడో ఏడాదిలో దానిని నిర్మూలిస్తామని చెప్పారు. కానీ నాలుగో సంవత్సరంలో ఏమో మేం హిందూ, మా పార్టీలో 90 శాతం హిందూవులు అంటూ చెబుతున్నారు. కానీ చివరి సంవత్సరంలో చేయాల్సినదంతా చేస్తారు. అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఆయన మూడు తత్వాల వ్యక్తిగా వ్యవహరిస్తారని అన్నారు. అమర్‌, అక్బర్ , ఆంటోని ఈ మూడు పాత్రలను కూడా రాహుల్ లో చూడవచ్చు అంటూ విమర్శించారు. రాహుల్‌ ఎన్నో సంవత్సరాల నుంచి విఫలమవుతున్న నాయకుడిగానే ఉండిపోయాడంటూ ఎద్దేవా చేశారు.

వచ్చే ఏడాది ఎన్నికల్లో డీఎంకే తుడిచి పెట్టుకుని పోవడం ఖాయమని చెప్పారు. ఈ మాట కేవలం మాది కాదు..డీఎంకే అధినేత స్టాలిన్ కొడుకే స్వయంగా చెప్పారంటూ ఆయన విమర్శించారు. డీఎంకే అంటే డీ అంటే డెంగ్యూ, ఎం అంటే మలేరియా, కే అంటే కోసు (దోమ) అన్నారు.

Advertisment
తాజా కథనాలు