/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ustad-jpg.webp)
Ustaad Bhagat Singh Villain Parthiban: ఉస్తాద్ భగత్ సింగ్...ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ అవ్వలేదు. మూవీ టీమ్​ కూడా ఎటువంటి విషయం కూడా చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రం విలన్ ఎవరనేది వివరాలు తెలిశాయి. ఉస్తాద్ భగత్ సింగ్​.. ఒరిజినల్ వెర్షన్ తేరిలో విలన్​ రోల్​ను మహేంద్రన్ చేశారు. అద్భుతంగా నటించారు. గతంలో ఓ సారి ఈ విలన్​ పాత్ర కోసం తనను అడిగారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ ప్రతినాయకుడి పాత్ర గురించి ఎటువంటి సమాచారం రాలేదు.అయితే తాజాగా ఆ విలన్​ రోల్​ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పవన్ ను ఎదుర్కొనబోయే విలన్ కూడా పవర్ ఫుల్గా ఉండాలని దర్శకుడు అనుకుంటున్నాడుట. అందుకే తమిళ యాక్టర్​ ఆర్ పార్తీబన్​ ను సెలెక్ట్ చేశారట. కోలీవుడ్​లో డైరెక్టర్​గా యాక్టర్​గా పార్తీబన్ మూడు దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. ఈయన తెలుగులో నటించింది తక్కువే. రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో కనిపించారు. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్​లోని కొన్ని సన్నివేశాల్లో. ఫుల్ లెన్త్ రోల్​ కాదు. అయితే ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్​లో మాత్రం ఎక్కువ స్పేస్ కనిపించనున్నారట. హరీశ్​ శంకర్ ఆయన విలన్​ రోల్​ను ఫుల్​ లెంగ్త్​లో డిజైన్ చేశారట.
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న షూటింగ్ లో పవన్ తో కొన్ని కీలక సీన్స్ ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దాని తర్వాత పవన్ లేకుండానే షూటింగ్ జరగనుందని టాక్. ఈ సినిమాలో పవన్ (Pawan Kalyan) ను కొత్తగా, పుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar). ఇక ఈ సినిమాలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వీలైతే సంక్రాంతి లేదా ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: నయనానందం…పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్