China - Taiwan: తైవాన్‌ చుట్టూ 33 యుద్ధ విమానాలు మోహరించిన చైనా..

చైనా - తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా.. తైవాన్ చుట్టూ చైనా 33 యుద్ధ విమానాలను మోహరించింది. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటేశాయి. దీంతో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు తైవాన్ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.

China - Taiwan: తైవాన్‌ చుట్టూ 33 యుద్ధ విమానాలు మోహరించిన చైనా..
New Update

చైనా - తైవాన్ మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చల్లారలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తైవాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆ ద్వీపం చుట్టూ చైనా ఏకంగా 33 యుద్ధ విమానాలను మోహరించింది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. చైనీస్‌ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. తైవాన్ చుట్టూ ఎస్‌యూ- 30 ఫైటర్‌ జెట్‌లతో పాటు 33 యుద్ధ విమానాలు, అలాగే 6 షిప్‌లను పంపింది. అయితే వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను కూడా దాటేసింది. దీంతో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు తైవాన్ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.

Also Read: ఉక్రెయిన్ బలగాలే రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చేశాయి: పుతిన్

తైవాన్ మా భూభాగమే 

ప్రస్తుతం తైవాన్ - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా - చైనా ప్రతినిధులు బ్యాంకాక్ రాజధాని అయిన థాయ్‌లాండ్‌లో సమావేశం కానున్నారు. ఈ ప్రకటన బయటికి రావడంతోనే చైనా.. తైవాన్‌పై సైనిక ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చైనా ఎప్పటినుంచో.. తైవాన్ తమ దేశ భూభాగంలోని భాగమని చెబుతూ వస్తుంది. కానీ తైవాన్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.

చైనా హెచ్చరికలు పట్టించుకోని తైవాన్

అందుకే గత కొంతకాలంగా తైవాన్‌పై యుద్ధ విమానాలు, నౌకలను పంపిస్తూ చైనా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తైవాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న లై డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ ఎక్కువగా సామాజిక న్యాయం, స్వీయ నిర్ణయాధికారంపై ప్రచారాలు చేస్తోంది. అంతేకాదు చైనా నుంచి వచ్చే హెచ్చరికలను కూడా తైవన్ పట్టించుకోవడం లేదు. దీనివల్ల మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి.

Also Read:  మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ..

ఏం మాట్లాడారు

అయితే చైనా - తైవాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థులపై చర్చలు జరిపేందుకు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సుల్లివన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి బ్యాంకాక్‌కు వెళ్లారు. కానీ వీళ్ల సమావేశం ఎప్పుడు జరిగిందో అన్న సంగతి ఇంకా తెలియలేదు. ఇదిలాఉండగా.. మరోవైపు అమెరికా - చైనా సంబంధాలపై తమ వైఖరిని చెబుతారని.. అంతర్జాతీయ, ప్రాంతీయ ఆందోళనపై కూడా మాట్లాడుతారని చైనా ప్రతినిధి ఒకరు తెలిపారు.

#telugu-news #china #taiwan #taiwan-china
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe