ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | YS Sharmila Comments | RTV
ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | Congress Leader YS Sharmila Comments on AP CM Chandrababu Naidu about Free Buses and other Schemes | RTV
ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | Congress Leader YS Sharmila Comments on AP CM Chandrababu Naidu about Free Buses and other Schemes | RTV
దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. 'మోదీ విశ్వగురు కాదు.. విష పురుగు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. వరదల్లో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. పంట నష్టం జరిగిన రైతుకు ప్రతి ఎకరాకు రూ. 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ ఆమె విషయం ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరాల ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలని, సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
జగన్ మళ్లీ ఇక అధికారంలోకి రాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి? మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పుచేయడానికి అధికారంలోకి రావాలా? అని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.
ఏపీలో రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.