YS Sharmila : వివేకాను చంపింది అవినాష్.. హంతకులకు రక్షగా జగన్ : పులివెందులలో షర్మిల సంచలన కామెంట్స్
వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా చంపిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్ అని ఆరోపించారు షర్మిల. ఈ దారుణాలు చూడలేకనే తాను పోటీ చేస్తున్నానన్నారు. పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల జగన్, అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.