Sharmila: మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా?: సజ్జలపై షర్మిల సంచలన కామెంట్స్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా..అధికార మదం తలకు ఎక్కిందా..మతి ఉండే మాట్లాడుతున్నావా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
YS Sharmila: ఏపీ సీఎం జగన్ పై దాడి దురదృష్టకరం..వైఎస్ షర్మిల ట్వీట్..!

Sharmila: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల గారు నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారని..వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

అధికార మదం తలకు ఎక్కిందా..మతి ఉండే మాట్లాడుతున్నావా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏమన్నారంటే. "నువ్వు , నీ కొడుకు పేమెంట్ తీసుకొని నన్ను, సునీతను నానా రకాలుగా హింసించారు.నువ్వు, నీ కొడుకు కలిసి సోషల్ మీడియా లో మాపై దృష్ప్రచారం చేశారు.నేను వైఎస్ కే పుట్టలేదని... విజయమ్మను అవమాన పరిచారు.సజ్జల జగన్ కి సలహాదారుగా ఉండటం జగన్ చేసుకున్న ఖర్మ.నోరు ఉంది కదాని ఎదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు.మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా.మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లా.మేము అంతా పెద్ద మాటలు మాట్లాడలేము.మాకు సంస్కారం అడ్డువస్తోంది" అంటూ షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: హమ్మయ్య..మొత్తానికి జేపీ నడ్డా భార్య కారు దొరికింది..అసలేం జరిగిందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు